వషట్కారః

ఇది విష్ణు సహస్రనామావళి లోని మూడో నామం. శ్రీమహావిష్ణువు వేదస్వరూపుడు అని ఈ నామానికి అర్థం. వేదమంత్రాలతో హోమాలు చేసేటప్పుడు మంత్రం చివరన ‘వషట్‌’ అనే శబ్దాన్ని చేర్చి హవిస్సు సమర్పిస్తుంటారు.

Published : 23 Jun 2022 01:26 IST

వందే విష్ణుం

ది విష్ణు సహస్రనామావళి లోని మూడో నామం. శ్రీమహావిష్ణువు వేదస్వరూపుడు అని ఈ నామానికి అర్థం. వేదమంత్రాలతో హోమాలు చేసేటప్పుడు మంత్రం చివరన ‘వషట్‌’ అనే శబ్దాన్ని చేర్చి హవిస్సు సమర్పిస్తుంటారు. సాధారణ పరిభాషలో వషట్కారాలు పెట్టడం అంటే నిందించటం అనే జాతీయార్థం ఉంది కానీ అది ఇక్కడ నప్పదు. ఇక్కడ కేవలం సర్వాంతర్యామి అయిన విష్ణువు వేద మంత్ర స్వరూపుడు, అన్నిటినీ నియంత్రించి పాలించేవాడు అని మాత్రమే అర్థాన్ని గ్రహించాలి.

- వై.తన్వి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని