జగం మిధ్య

ఒకరోజు రమణ మహర్షిని ‘అన్నీ, అంతటా బ్రహ్మమే అని చెబుతున్నప్పుడు ఈ జగత్తు కూడా అదే కావాలి కదా! కానీ దానిని మిథ్య అని ఎందుకు అంటున్నారు స్వామీ?’ అడిగాడో శిష్యుడు. దానికాయన ‘బ్రహ్మం తెర వంటిది. దానిపైన కదలాడే జీవులు పాత్రలు. తెర ఉన్నంతసేపు బొమ్మల కదలికలు చూడ గలం

Published : 30 Jun 2022 00:25 IST

ఒకరోజు రమణ మహర్షిని ‘అన్నీ, అంతటా బ్రహ్మమే అని చెబుతున్నప్పుడు ఈ జగత్తు కూడా అదే కావాలి కదా! కానీ దానిని మిథ్య అని ఎందుకు అంటున్నారు స్వామీ?’ అడిగాడో శిష్యుడు. దానికాయన ‘బ్రహ్మం తెర వంటిది. దానిపైన కదలాడే జీవులు పాత్రలు. తెర ఉన్నంతసేపు బొమ్మల కదలికలు చూడ గలం. మన కళ్లకు కనిపించే ఈ జగతి నిజానికి ఒక భ్రాంతి. దీనిని మనదైన దృష్టి కోణంలోంచి మాత్రమే చూస్తుంటాం. మనసు చూపే విధంగా కనిపిస్తుంది ప్రపంచం. ఇంకా సులభంగా అర్థమయ్యేలా చెప్పనా.. అద్దం బ్రహ్మ అనుకుంటే అందులో కనిపించే ప్రతిబింబం, దాని అందం, హావభావాలు మిధ్య. అంటే మనం అద్దం ముందు నుంచి తొలగిపోగానే అది ఎప్పటిలా దర్పణంగానే ఉంటుంది తప్ప మిధ్యా ప్రతిబింబం కనిపించదు. వ్యవహారిక దృష్టితో చూసినపుడు లోకం సత్యంగా తోస్తుంది. కానీ జ్ఞానదృష్టితో చూసినప్పుడు అది కేవలం మిధ్య అని అర్థమవుతుంది. దీనికి మంచి ఉదాహరణ నిద్ర. నిద్రలో బాహ్య ప్రపంచం కనిపించదు. కానీ మెలకువ రాగానే కనిపిస్తుంది. కనుకనే జగత్తు మిధ్య అంటున్నాం. నేను అనే భావన కూడా బ్రహ్మపదార్థమైన ఆత్మ నుంచి వెలువడుతుంది. ఈ నేను అనేది అహం. దీని పుట్టుకను కనుక్కోవడం అంటే ఆత్మజ్ఞానం పొందడమే. అప్పుడు జగత్తు మిధ్య అని బోధపడుతుంది. కలలో దాహం వేసి నీళ్లు తాగావు. కానీ ఆ దాహం, ఆ నీళ్లు ఎలా అయితే సత్యం కాదో ఈ జగత్తు కూడా కేవలం మిధ్య’ అంటూ వివరించారు.                  

- శ్రావణి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని