Updated : 30 Jun 2022 03:16 IST

ఆధ్యాత్మిక శిఖరం

స్వామి వివేకానంద ఒక సదస్సులో మాట్లాడుతూ మనందరం భరతమాత ముద్దుబిడ్డలం. ఆ తల్లి కడుపున పుట్టి ప్రకృతి ఒడిలో హాయిగా పెరిగాం. దేశమాత స్తన జ్ఞానామృతాన్ని తాగి, ఉన్నత శిఖరాలను అధిరోహించి ఆమె కోసం పాటుపడని వాళ్లు దేశద్రోహులే’ అన్నారు. ఆయన మన దేశ తాత్వికతను, వైభవాన్నీ యావత్‌ ప్రపంచానికీ చాటిచెప్పిన మహనీయుడు.
‘ఆధ్యాత్మికత, ఏకత్వభావన, దేశాన్ని ఉద్ధరించడం ప్రతి ఒక్కరి కర్తవ్యం. త్యాగం, శీలం, సేవ భరతజాతి ఆదర్శాలు. జాతి పరిపూర్ణం కావాలంటే ఈ మూడు గుణాలనూ అలవరచు కోవాలి. ప్రతి జీవీ దైవత్వంతో నిండి ఉంది. ఔన్నత్యాన్ని వ్యక్తపరుస్తూ పదిమందిలో ఆదర్శంగా నిలబడటమే జీవిత లక్ష్యం కావాలి. పేదల కోసం హృదయం క్షోభించి సేవకుడిలా పవిత్రతతో, సహనంతో, అకుంఠిత దీక్షతో, ప్రేమతో ఎవరైతే సేవ చేస్తారో అలాంటి వారే ఈ దేశానికి నిజమైన నాయకులు’ అంటూ ఒకసారి నిండు సభలో చెప్పారాయన.
‘ఈ మానవీయ లక్షణాలు మనిషిలో కలగాలంటే భగవద్గీతలోని తాత్వికతను వజ్రసంకల్పమైన మనసుతో, ఇనుప కండరాలతో అధ్యయనం చేయాలి. నా మనసులోని మాటను చెప్పాలంటే నాలాంటివాళ్లు వందమంది లభిస్తే ఈ భరతఖండాన్ని విశ్వగురు పీఠస్థానానికి తీసుకువెళ్తాను’ అని దృఢ విశ్వాసంతో చెప్పిన మహా మనీషి స్వామి వివేకానంద.

- శ్రీమయి


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని