నిజమైన వీరుడు

ఒకసారి ముహమ్మద్‌ ప్రవక్త (స) శాలువా కప్పుకుని పనిమీద బయల్దేరారు. దారిలో ఓ మొరటు వ్యక్తి శాలువాను పట్టుకుని లాగడంతో ఆయన భుజం కందిపోయింది. ఆ వ్యక్తి అంతటితో ఆగక, ‘అల్లాహ్‌ నీకిచ్చిన సొమ్ములోంచి నాక్కొంచెం ఇప్పించు!’ అన్నాడు కటువుగా.

Updated : 30 Jun 2022 03:18 IST

ఒకసారి ముహమ్మద్‌ ప్రవక్త (స) శాలువా కప్పుకుని పనిమీద బయల్దేరారు. దారిలో ఓ మొరటు వ్యక్తి శాలువాను పట్టుకుని లాగడంతో ఆయన భుజం కందిపోయింది. ఆ వ్యక్తి అంతటితో ఆగక, ‘అల్లాహ్‌ నీకిచ్చిన సొమ్ములోంచి నాక్కొంచెం ఇప్పించు!’ అన్నాడు కటువుగా. దానికి ప్రవక్త (స) పక్కనున్న సహచరులవైపు చూసి ‘కుస్తీపోటీలో ప్రత్యర్థిని చిత్తు చేసేవాడు వీరుడు కాడు, కోపాన్ని అదుపులో ఉంచుకునేవాడే నిజమైన వీరుడు. ఇతనికి కొంత ధనం ఇవ్వండి’ అన్నారు శాంతంగా. క్షమాపణ, మృదుస్వభావాలను అలవరచుకో. మంచిని ప్రబోధించు. మూర్ఖులతో చూసీచూడనట్టు ప్రవర్తించు’ అన్న ఖురాన్‌ ఉద్బోధను అర్థం చేసుకుని ఆచరించాలని ఉలమాలు బోధిస్తారు.      

- ఖైరున్నీసాబేగం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని