స్వయంజ్యోతి

చైనాలో ఒక జెన్‌ మాస్టర్‌ తన గురువుగారి జన్మ దినోత్సవ వేడుకలు జరుపుతున్నాడు. ఆ సంగతి తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ జెన్‌ మాస్టర్‌కు గురువు గారు ఉన్న దాఖలా లేదు. ఆయన ఎన్నడూ ఎవరినీ అనుసరించడు.

Published : 07 Jul 2022 00:55 IST

చైనాలో ఒక జెన్‌ మాస్టర్‌ తన గురువుగారి జన్మ దినోత్సవ వేడుకలు జరుపుతున్నాడు. ఆ సంగతి తెలిసి అంతా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ జెన్‌ మాస్టర్‌కు గురువు గారు ఉన్న దాఖలా లేదు. ఆయన ఎన్నడూ ఎవరినీ అనుసరించడు. అలాంటిది ఆయనకు గురువేమిటనుకున్నారు. తమ సందేహాన్ని ఆయన ముందుంచారు. జెన్‌ మాస్టర్‌ చిన్నగా నవ్వి, ‘అవును నిజమే! ఆయన నన్ను శిష్యుడిగా స్వీకరించనన్నారు. కానీ ఆయనే నా గురువు. నేనాయనకు శిష్యుణ్ణి’ అన్నాడు. ఆ సమాధానం ఎవరికీ అర్థం కాలేదు. ‘ఆయన తమర్ని అంగీకరించకుండా మీరెలా శిష్యుడయ్యారు?’ అనడిగారు. ‘ఆయన తనను అనుకరించవద్దని గట్టిగా చెప్పారు. నేనాయనకు నకలుగా ఉండటం ఇష్టం లేదు. నాలో అంతర్లీనంగా శక్తి ప్రజ్వలించడం గుర్తించానన్నారు. నన్ను శిష్యుడిగా చేసుకుని నియమాలు, క్రమశిక్షణతో కట్టడి చేస్తే నాలోని జ్ఞాన దీపాన్ని వెలగకుండా చేయడమేనని, నామానాన నన్ను వదిలేసి స్వయంజ్యోతిగా వెలగమన్నారు. ఆయన నన్నెంతో అభిమానించారు. శిష్యుడిగా ఒదిగిపోయి ప్రభావితమవడం ఇష్టంలేదు, అందుకే తన వద్ద చేర్చుకోవడం లేదన్నారు. నా అభ్యున్నతి ఆశించిన ఆయనంటే నాకెంతో గౌరవం. నేను ఎదగడానికి దోహదం చేసిన అసలైన గురువు’ అంటూ వివరించాడాయన.

- ప్రతాప వెంకట సుబ్బారాయుడు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు