పక్షులు చెప్పిన జోస్యం

కాకతీయుల నాటి అద్భుత కట్టడం ఎఱకేశ్వరాలయం. సూర్యాపేట దగ్గర్లోని పిల్లలమర్రికి పశ్చిమాన ఉందీ ఆలయం. ఇక్కడ శివుడు చెన్నకేశ్వర స్వామిగా దర్శనం ఇస్తున్నాడు. ఈ గుడికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది.

Published : 21 Jul 2022 00:25 IST

కాకతీయుల నాటి అద్భుత కట్టడం ఎఱకేశ్వరాలయం. సూర్యాపేట దగ్గర్లోని పిల్లలమర్రికి పశ్చిమాన ఉందీ ఆలయం. ఇక్కడ శివుడు చెన్నకేశ్వర స్వామిగా దర్శనం ఇస్తున్నాడు. ఈ గుడికి వెయ్యేళ్ల చరిత్ర ఉంది.

కాకతీయులకు సామంతులైన రేచర్ల కుటుంబానికి చెందిన బాటిరెడ్డి అర్ధాంగి ఎఱకసాని ఆధ్వర్యంలో ఇది నిర్మితమైంది. అందుకే ఈ స్వామిని ఎఱకేశ్వరుడని పిలుస్తారు. 14వ శతాబ్దంలో అల్లావుద్దీన్‌ ఖిల్జీ ఈ ఆలయాన్ని ధ్వంసం చేయగా, ముసునూరి నాయక రాజవంశానికి చెందిన కాపయ నాయకుడు పునర్నిర్మించాడట. గర్భాలయం పశ్చిమ దిక్కున ఉంది. గుడి నిర్మాణంలో ఉపయోగించిన రాయి వల్ల ప్రత్యేక ధ్వని వస్తుంది. ఆకట్టుకునే స్తంభాలు, వాటిమీదున్న బొమ్మలు అబ్బురపరుస్తాయి. స్థల పురాణాన్ని అనుసరించి... ఇక్కడ ఏడెకరాలకు పైగా విస్తరించిన పిల్లలమర్రి చెట్టు ఉండేది. ఒకరోజు ‘పెద్ద భూకంపం రాబోతోందనీ, చెట్టు నేలకొరుగుతుందనీ, ఆ చెట్టు కింద ఘనమైన ఖనిజ సంపద ఉందనీ... చెట్టు మీది పక్షులు పలుకుతుండగా... ఒక గిరిజనుడు విన్నాడు. ఆ సంగతి ఆ ప్రాంత పాలనాధికారి బేతిరెడ్డికి చెప్పాడు. కొద్దిసేపటికే ఆ జోస్యం నిజమైంది. చెట్టు నేలకొరుగగా, దాని కింద అపార ఖనిజ సంపద లభ్యమైంది. అదంతా స్వాధీనం చేసుకుని ఈ ఆలయాన్ని నిర్మించారని  స్థానికంగా చెప్పుకుంటారు. సూర్యాపేట నుంచి బస్సు లేదా ఆటోలో పిల్లలమర్రి ఎఱకేశ్వరాలయానికి సులువుగా చేరుకోవచ్చు.

- బొగ్గరపు వెంకటేష్‌.ఎమ్‌.ఎన్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు