దేవునిపనికి ప్రతిఫలమా?!

జునైద్‌ బుగ్దాదీ ప్రఖ్యాత ఇస్లామీయ తత్వవేత్త. ఆయన చదువుకుంటున్న రోజుల్లో ఒకసారి గురువుగారు ‘జుట్టు బాగా పెరిగిపోయింది, క్షవరం చేయించుకో’ అన్నారు. తన దగ్గర పైసా లేకున్నా క్షురకుని వద్దకు వెళ్లి ‘అల్లాహ్‌ కోసం క్షవరం చెయ్యి’ అన్నారు.

Published : 21 Jul 2022 00:28 IST

జునైద్‌ బుగ్దాదీ ప్రఖ్యాత ఇస్లామీయ తత్వవేత్త. ఆయన చదువుకుంటున్న రోజుల్లో ఒకసారి గురువుగారు ‘జుట్టు బాగా పెరిగిపోయింది, క్షవరం చేయించుకో’ అన్నారు. తన దగ్గర పైసా లేకున్నా క్షురకుని వద్దకు వెళ్లి ‘అల్లాహ్‌ కోసం క్షవరం చెయ్యి’ అన్నారు. క్షురకుడు ఉచితంగా క్షవరం చేయడమేగాక చిన్న డబ్బుమూట ఇచ్చి ‘దీన్ని వాడుకోండి’ అన్నాడు. ఈ సంఘటన జరిగి కొన్నేళ్లు గడిచాయి. జునైద్‌ తన ధార్మిక విద్య పూర్తయి పండితుడిగా పేరు గడించారు. ఒకసారి బస్రా పట్టణం నుంచి ఓ బృందం వచ్చింది. వాళ్లు జునైద్‌ బుగ్దాదీ సేవను మెచ్చుకుని బంగారు నాణాలు సమర్పించుకున్నారు. వాటిని చూడగానే క్షురకుడు గుర్తొచ్చి వెంటనే వెళ్లి ఆ నాణాల సంచిని అతనికిచ్చి ‘మొదటిసారి వచ్చిన కానుకను తమరికి ఇస్తానని సంకల్పం చేసుకున్నాను, స్వీకరించండి’ అన్నారు వినయంగా. అందుకతను కోపంగా ‘మీకు దైవమంటే భయంలేదా? దేవుని మెప్పుకోసం చేసిన పనికి ప్రతిఫలం ఆశిస్తారా? దీన్ని తమరే ఉంచుకోండి’ అన్నాడు. జునైద్‌ నిర్ఘాంతపోయారు. దేవుని మెప్పుకోసం పనిచేసి ప్రజల నుంచి ప్రతిఫలం ఆశించ కూడదన్నది ఇందులో నీతి.

- తహూరా సిద్దీఖా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని