భట్టివిక్రమార్కులు ప్రతిష్టించిన శివలింగాలు

గోదావరి తీరం ఆలమూరులో కొలువైంది భట్టి విక్రమార్కేశ్వర ఆలయం. భట్టి ్టవిక్రమార్కులు ప్రతిష్టించిన శివలింగాలతో అలరారే ఆలయం దక్షిణ భారతదేశంలో ఇదొక్కటే. ఉత్తరాదిన ఉజ్జయిని క్షేత్రంలో ఆయన ప్రతిష్టించినది మరొకటుంది.

Published : 28 Jul 2022 00:59 IST

గోదావరి తీరం ఆలమూరులో కొలువైంది భట్టి విక్రమార్కేశ్వర ఆలయం. భట్టి ్టవిక్రమార్కులు ప్రతిష్టించిన శివలింగాలతో అలరారే ఆలయం దక్షిణ భారతదేశంలో ఇదొక్కటే. ఉత్తరాదిన ఉజ్జయిని క్షేత్రంలో ఆయన ప్రతిష్టించినది మరొకటుంది.

స్థల పురాణాన్ని అనుసరించి... ఉజ్జయిని రాజధానిగా పాలించిన విక్రమార్కుడి రాజ్యం గౌతమీనదీ వరకు ఉండేది. సుదీర్ఘ పరిపాలన తర్వాత శాలివాహనుడు అనే కుమ్మరి బాలుడి చేతిలో తనకు ఓటమి ఎదురవ్వబోతుందని విక్రమార్కునికి ముందుగానే తెలిసింది. అనుకున్నట్లుగానే శాలివాహనుడు యుద్ధం ప్రకటించడంతో ప్రస్తుత ఆలమూరు ప్రాంతాన్ని రణభూమిగా నిర్ణయించుకున్నారు. ఆలము అంటే యుద్ధం. అక్కడ యుద్ధం జరిగినందున ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందంటారు. విక్రమార్కుడు తన అన్న భట్టితో సమాలోచన జరిపి తమ పేర్లతో శాశ్వతంగా నిలిచి ఉండే పుణ్యకార్యం యుద్ధం కంటే ముందే చేయాలనుకున్నాడు. సృష్టి ఉన్నంత వరకూ శైవాగమం ఉంటుందని, శివలింగ ప్రతిష్ట చెయ్యాలనుకున్నాడు. ఎత్తయిన గుట్ట మీద భట్టి, విక్రమార్కులు పక్క పక్కనే రెండు శివలింగాలు ప్రతిష్టించి మట్టితో రెండు భవ్యాలయాలను నిర్మించారు. భట్టి ప్రతిష్టించిన లింగం భట్టిశ్వరునిగా, విక్రమార్కుడు ప్రతిష్టించిన లింగం విక్రమార్కేశ్వరుడిగా పేరొంది, నేటికీ  పూజలందుకుంటున్నాయి.

‘అభిషేక ప్రియోఃశ్శివః’ అన్నారు. అంటే శివుడు అభిషేకప్రియుడు. కానీ భట్టివిక్రమార్కులు ప్రతిష్టించిన ఈ ఆలయంలో భట్టిశ్వరునికే అభిషేకాలు జరుగుతాయి. విక్రమార్కేశ్వరునికి అభిషేకాలు జరగవు. పుష్పార్చనలు మాత్రమే జరపడం ఇక్కడి ఆనవాయితీ.

- గొడవర్తి శ్రీనివాసు, ఆలమూరు 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని