పెద్దల బాధ్యతలను తెలిపే రుషభగీత

భాగవతం పంచమ స్కంధంలో శుక మహర్షి పరీక్షిన్మహారాజుకు వివరించినదే రుషభగీత. పూర్వం నాభి అనే మహారాజు ప్రజారంజకంగా పరిపాలించేవాడు. ఆయనకు చాలాకాలం సంతానం కలగనందున యజ్ఞ పురుషుడైన శ్రీమహావిష్ణువును ఆరాధించాడు.

Published : 28 Jul 2022 01:03 IST

భాగవతం పంచమ స్కంధంలో శుక మహర్షి పరీక్షిన్మహారాజుకు వివరించినదే రుషభగీత. పూర్వం నాభి అనే మహారాజు ప్రజారంజకంగా పరిపాలించేవాడు. ఆయనకు చాలాకాలం సంతానం కలగనందున యజ్ఞ పురుషుడైన శ్రీమహావిష్ణువును ఆరాధించాడు. విష్ణుమూర్తి నాభి దంపతులకు రుషభుడిగా జన్మించి అజనాభం రాజ్యాన్ని పాలించసాగాడు. అతడికి నూరుగురు కుమారులు కలిగారు. వారిలో భరతుడు రాజ్యాధికారాన్ని చేపట్టగా భరతవర్షంగా ప్రసిద్ధి చెందింది. భరతుడి 99 సోదరుల్లో 9 మంది భాగవత ధర్మాన్ని ప్రచారం చేసేందుకు వెళ్లిపోయారు. రుషభుడు సాంసారిక బంధాల్లో చిక్కుకోకుండా రాజ్యాన్ని భరతుడికి అప్పగించాడు. మిగిలినవారికి భరతుణ్ణి అనుసరించమని చెప్పాడు. కుమారులందరికీ ఉత్తమ ధర్మాలను, మోక్షాన్ని పొందే విధానాన్ని బోధించి తాను సన్యాసాశ్రమాన్ని స్వీకరించి అనంతరం అవధూతగా మారి జీవితాన్ని చాలించాడు. ఆ రుషభుడు బోధించిన అంశాలే రుషభగీతగా ప్రసిద్ధికెక్కాయి. సమయానుగుణ ధర్మాలను ఆచరించాలని, ధర్మ, అర్థ, కామ, మోక్ష, అపేక్ష, అభిలాషతో గృహస్థాశ్రమ ధర్మం పాటించాలనీ ప్రజలకు బోధించాడు. 

సాక్షాత్తూ దేవుడు ఒక తండ్రిగా, పాలకుడుగా ఆదర్శవంతంగా నిలిచి చూపాడు. ఆ బోధలన్నీ నేటికీ అనుసరణీయంగా ఉన్నాయి.

- మల్లు, గుంటూరు 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని