బిస్మిల్లాహ్‌ పలకలేదని...

ప్రవక్త ఇబ్రాహీంకు (అలైహి అలైహిస్సలాం) ఒంటరిగా భోజనం చేసే అలవాటు లేదు. ఆ పూటకు తనతో కలిసి తినడానికి ఎవరూ లేకుంటే దారిన పోతున్న బాటసారిని ఆహ్వానించారు. ఇబ్రాహీం తినబోతూ ఎప్పట్లాగే అల్లాహ్‌ను తల్చుకున్నారు. కానీ బాటసారి

Published : 28 Jul 2022 01:12 IST

ప్రవక్త ఇబ్రాహీంకు (అలైహి అలైహిస్సలాం) ఒంటరిగా భోజనం చేసే అలవాటు లేదు. ఆ పూటకు తనతో కలిసి తినడానికి ఎవరూ లేకుంటే దారిన పోతున్న బాటసారిని ఆహ్వానించారు. ఇబ్రాహీం తినబోతూ ఎప్పట్లాగే అల్లాహ్‌ను తల్చుకున్నారు. కానీ బాటసారి ‘బిస్మిల్లాహ్‌’ పలకకుండానే తినసాగాడు. అది నచ్చని ఇబ్రాహీం ‘మిత్రమా! భోజనానికి ముందు బిస్మిల్లాహ్‌ అనలేదేం?!’ అన్నారు. ‘నాకు దేవునిపై నమ్మకం లేనప్పుడు ఎందుకు తలచుకోవాలి?’ అని ఎదురు ప్రశ్నించాడు. దాంతో ప్రవక్తకు కోపం వచ్చింది. అతడు తినకుండానే లేపేశారు. బిక్క ముఖంతో వెళ్లిపోయాడతను. ఆ వ్యవహారంతో అల్లాహ్‌కు కోపం వచ్చింది. ‘ఈ వ్యక్తి వందేళ్లుగా నన్ను విశ్వసించ కుండానే బతుకుతున్నాడు. అయినా నేనతనికి ఆహారం ఇస్తూనే ఉన్నాను. కానీ నువ్వు ‘బిస్మిల్లాహ్‌’ పలకలేదని ఒక్క పూట కూడా తిండి పెట్టలేకపోయావు!’ అంటూ దైవవాణి వినిపించింది. ప్రవక్త  తన తప్పు తెలుసుకుని అతణ్ణి వెతికి పట్టుకుని క్షమాపణ కోరారు. భోజనం చేశాక మన్ననగా సాగనంపారు. 

- ముహమ్మద్‌ ముజాహిద్‌ 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని