Published : 28 Jul 2022 01:16 IST

పుట్టమన్నుతో ఆరోగ్యం

ఆగస్టు 2 నాగ పంచమి

నాగుల చవితి, నాగ పంచమి రోజుల్లో పుట్టలో మట్టిని తెచ్చి చెవి తమ్మెలకు రాసుకోమంటారు పెద్దలు. అలా చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో కూడా చెప్పారు.. పాములు స్వయంగా పుట్టను నిర్మించుకోవు. చీమల పుట్టలను ఆక్రమించుకుంటాయి. పుట్టలో చీమలు విడిచిన ఫార్మిక్‌ ఆమ్లం పాముల వాసనా శక్తిని, కంటి చూపును, గ్రహణ శక్తిని మెరుగుపరిచే రసాయనం. పాములకు చెవులు బయట ఉండవు. లోపలి ‘పిట్‌’ అనే చెవి ధ్వనిని గ్రహిస్తుంది. అంటే ఇంద్రియ శక్తులను ప్రభావితం చేసే ఆమ్లం పుట్టలో శోషణ స్థితిలో ఉంటుంది. ఇలా ఔషధ గుణం కలిగిన పుట్ట మన్నును చెవి తమ్మెలకి రాసుకోవడం ద్వారా వినికిడి, వాసన, చూపుల సామర్థ్యం పెరుగుతుంది. ముక్కు, కళ్లకు ప్రత్యక్షంగా రాస్తే దుమ్మువల్ల ఎలర్జీ, ఇన్‌ఫెక్షనూ రావచ్చు. కానీ 12 కపాల నాడుల్లో త్రిమితీయ (ట్రైజెమినల్‌) నాడి చర్మం, సైనస్‌లు, శ్లేష్మ పొరలకు ఇంద్రియ సమాచారాన్ని ప్రసారం చేస్తుంది. దీన్నుంచి బయల్దేరే మూడు శాఖలు కన్ను, ముక్కు, చెవులకు చేరతాయి. అంటే చెవులకు రాసుకున్న పుట్టమన్నులోని ఔషధగుణం ముక్కు, కళ్లకు కూడా పనిచేస్తుంది. మన ఆచారాల్లో దాగిన వైద్య చిట్కా ఇది.

- డాక్టర్‌ జయదేవ్‌ చల్లా 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని