జీవన తరుణోపాయ బోధిని నవయోగీశ్వర గీత

విదేహ మహారాజు నిమి చక్రవర్తికి తొమ్మిదిమంది యోగీశ్వరులు బోధించిన భాగవత ధర్మ సారమే నవయోగీశ్వర గీత. దీనికి భాగవత ధర్మగీత అనే పేరు కూడా ఉంది. భాగవతం పదకొండో స్కందలో వసుదేవ, నారదుల మధ్య జరిగిన సంభాషణ ఇది. సంసార తరుణోపాయం, మోక్షాపేక్ష మార్గాన్వేషణ గురించి నారదుడు వివరిస్తాడు.

Updated : 04 Aug 2022 03:57 IST

విదేహ మహారాజు నిమి చక్రవర్తికి తొమ్మిదిమంది యోగీశ్వరులు బోధించిన భాగవత ధర్మ సారమే నవయోగీశ్వర గీత. దీనికి భాగవత ధర్మగీత అనే పేరు కూడా ఉంది. భాగవతం పదకొండో స్కందలో వసుదేవ, నారదుల మధ్య జరిగిన సంభాషణ ఇది. సంసార తరుణోపాయం, మోక్షాపేక్ష మార్గాన్వేషణ గురించి నారదుడు వివరిస్తాడు. మనిషి జీవితం జనన మరణ రూపమై భయంకరంగా ఉంటుంది. సుఖం, దుఃఖం ఒకలానే కనిపిస్తాయి. ఇలాంటి స్థితిని సులభంగా దాటగల ఉపాయాన్ని చెప్పమన్నప్పుడు ముందుగా ఉపయోగీశ్వర గీతగా నారదుడు కొన్ని వివరాలను చెప్పి తర్వాత నవయోగీశ్వర గీతను వివరించాడు. బ్రహ్మవిద్యా విశారదులైన రుషభుని తొమ్మిదిమంది పుత్రులు నిరంతరం ఉపాసన చేయుటం పరమ శ్రేయోమార్గమని, దానివల్లనే మోక్షం సులభ సాధ్యమని వివరించారు. శరీరం, వాక్కు, మనసులతో చేసే కార్యాలన్నీ నారాయణార్పితం అనుకోవాలి. ఇంద్రియాలూ, బుద్ధితో చేసే పనులన్నీ ఆ స్వామి కోసమే అనుకుంటూ చేస్తే భగవంతుడికి ఇష్టం. అప్పుడు అధర్మ మార్గాన్ని అనుసరించలేరు. అలా మోక్షప్రాప్తి లభిస్తుంది. అలాగే గురువును ఆరాధ్య దైవంగా, ప్రియతమునిగా భావించాలి. అలా గడిపితే జీవితం ధన్యమవుతుందని బోధిస్తోందీ గీత.

- మల్లు, గుంటూరు
 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని