Published : 04 Aug 2022 01:08 IST

సంపాతి సోదర ప్రేమ

వినత, కశ్యప ప్రజాపతిల పెద్దకొడుకు అరుణుడికి ఇద్దరు కొడుకులు. సంపాతి, జటాయువు. ఇద్దరూ బలవంతులే. ఆకాశంలో ఎంతో ఎత్తున అత్యంత వేగంగా ప్రయాణించగలరు. ఒకరోజు వాళ్లిద్దరూ ఉత్సాహంగా ఎగురుతూ పైపైకి వెళ్లసాగారు. మధ్యాహ్నానికి చిన్నవాడైన జటాయువు ఎండ వేడికి తట్టుకోలేక సోలిపోతుంటే సంపాతి అతడిపై తన రెక్కలు కప్పాడు. అయినా ఫలితం లేకపోయింది. జటాయువు జనస్థానంలో, సంపాతి వింధ్యపర్వతాల మీద పడిపోయారు. ఆరురోజుల తర్వాత సంపాతికి స్పృహ వచ్చింది. నిశాకరుడనే ముని ఈ పరిసరాల్లోనే ఉంటాడని గుర్తొచ్చి వెళ్లాడు. అతణ్ణి చూసి ఆశ్చర్యపోయిన ముని ఏమైందని అడగ్గా రాజ్యాన్ని, రెక్కల్ని, తమ్ముణ్ణి పోగొట్టుకుని అశక్తుణ్ణి అయ్యానని, నైరాశ్యంలో మునిగి ఉన్నానని దిగులుగా చెప్పాడు. సోదరుడంటే తనకు ఎంత ప్రేమో, అతడికోసం ఎంత దుఃఖిస్తున్నాడో, తన రెక్కలు కాలి పోయిన సంగతి వివరించాడు. సీతని వెతుకుతూ వచ్చిన వానరులకు ఆమె జాడ చెప్పగానే కాలిన రెక్కల స్థానంలో కొత్తరెక్కలొస్తాయని ధైర్యం చెప్పాడు ముని. కొన్నాళ్లకి సీతను అన్వేషిస్తూ వానరులు వచ్చారు. సంపాతి తమని తినబోతుంటే.. ‘సీతమ్మ జాడ దొరకలేదు, సుగ్రీవుడిచ్చిన గడువు దాటిపోయింది’ అంటూ చెప్పారు. వారి మాటల్లో జటాయువు మరణించిన సంగతి విని అతడు ఎంతగానో బాధపడ్డాడు. సీతమ్మను రావణాసురుడు అపహరించుకు వెళ్లాడని, ఆమె లంకలోనే ఉందని, తన సోదరుణ్ణి చంపిన రావణుడిపై పగ తీర్చుకోమంటూ వానరులను పురికొల్పాడు సంపాతి.  

- డాక్టర్‌ అనంతలక్ష్మి


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని