గండిక్షేత్రం.. భక్తకోటి దివ్యధామం
రాయలసీమలోని గండిక్షేత్రంలో శ్రావణమాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ రెండు కొండల నడుమ ప్రవహిస్తున్న పాపఘ్ని నది పాపాలను హరిస్తుందనేది స్థానికుల నమ్మకం. ఈ నది కమలాపురం సమీపంలోని సంగమేశ్వర ఆలయాల వద్ద పెన్నానదిలో కలుస్తుంది. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు నదీ స్నానం చేసి వెళ్తారు.
స్థల పురాణాన్ని అనుసరించి రావణుడు సీతమ్మను అపహరించుకు వెళ్లగా ఆమెను వెతుక్కుంటూ రామలక్ష్మణులు వాయుక్షేత్రానికి చేరుకున్నారు. అక్కడ తపస్సు చేసుకుంటున్న వాయుదేవుడు సాదరంగా ఆహ్వానించి కొంతకాలం విశ్రాంతి తీసుకోమన్నాడు. సీతను వెదికే పనిలో ఉన్నామని, ఆమె దొరికిన తర్వాత తిరిగి వెళ్లేటప్పుడు బస చేస్తామని మాటిచ్చారు. చెప్పినట్లుగా రావణుణ్ణి వధించి సీతాసమేతంగా వాయుక్షేత్రానికి చేరుకున్నారు. దాంతో వాయుదేవుడు ఆ క్షేత్రాన్ని అందంగా ముస్తాబుచేసి, రెండు కొండల నడుమ బంగారు మామిడాకుల తోరణాన్ని కట్టించాడు. ఆ ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తున్న రాముడు యుద్ధంలో తనకు సాయంచేసిన వీరాంజనేయ చిత్రం గీయసాగాడు. ఇంతలో అయోధ్యకు వెళ్లే సమయం మించి పోతోందంటూ లక్ష్మణుడు గుర్తు చేయగా చిత్రంలో ఎడమ చిటికెనవేలు వేయకుండానే బయల్దేరాడు. నాడు రాముడు తన బాణంతో చిత్రించిన వీరాంజనేయస్వామి రూపమే నేటికీ పూజలందుకుంటోంది. ఆ దివ్య వాయుక్షేత్రమే గండిక్షేత్రంగా విరాజిల్లుతోంది. కడప, కర్నూలు, ప్రొద్దుటూరు, వేంపల్లె, రాయచోటి మీదుగా గండికి చేరుకోవచ్చు. శ్రావణమాసంలో తరలివచ్చే భక్తుల కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.
- బోగెం శ్రీనివాసులు, కడప
Advertisement
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Agnipath: విశాఖలో అగ్నివీరుల ఎంపిక ప్రారంభం.. తరలివచ్చిన అభ్యర్థులు
-
Sports News
Team India : కోచ్‌కు కూడా విశ్రాంతి.. భారత్ రొటేషన్ సూపర్: పాక్ మాజీ కెప్టెన్
-
General News
Telangana News: వీడని ముసురు.. తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు
-
Movies News
Indra: డియర్ మెగా ఫ్యాన్స్.. వైజయంతి మూవీస్ ట్వీట్
-
World News
Bangladesh economic crisis: ఆర్థిక సంక్షోభం అంచున బంగ్లాదేశ్..!
-
Politics News
Revanth reddy: సమస్యలపై మునుగోడులో చర్చ జరగాలి.. వ్యక్తిగత దూషణలు వద్దు: రేవంత్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 14 - ఆగస్టు 20)
- Rakesh Jhunjhunwala: ప్రముఖ వ్యాపారవేత్త రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణం
- Hyderabad News: ఇంజినీరింగ్ విద్యార్థినికి భారీ ప్యాకేజీతో ఉద్యోగం
- Rakesh Jhunjhunwala: ఆయన జీవితమే ఓ ఆర్థిక మంత్రం..!
- MK Stallin: ఆ నదిపై నిర్మాణాలొద్దు.. జగన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
- Viral Video: క్షణం ఆలస్యమైనా పాము కాటేసేదే..! అంతలో ఏం జరిగిందంటే
- RRR: ఆస్కార్‌లోనూ ‘ఆర్ఆర్ఆర్’ హవా కొనసాగుతుంది..
- Tunnel: బ్యాంకు లూటీకి ఏకంగా సొరంగం తవ్వకం.. ఆపై ఊహించని ఘటన!
- బంగారం ధర నిర్ణయించే శక్తిగా భారత్?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (14/08/2022)