Published : 04 Aug 2022 01:21 IST

హనుమ వాహనం ఒంటె

వాయువేగంతో ఆకాశంలో దూసుకుపోయే ఆంజనేయుడే మనందరికీ తెలుసు. కానీ కొన్ని ప్రాంతాల్లో హనుమ వాహనంగా ఒంటె కనిపిస్తుంది. దీనికి సంబంధించిన కథ పరాశర సంహితలో ఉంది. భీకర యుద్ధానంతరం దుందుభిని వధించాడు వాలి. మృతదేహాన్ని రుష్యమూక పర్వతంపై పడేసి వెళ్లిపోయాడు. ఈ సంఘటన వాలి, సుగ్రీవుల మధ్య వైరం రగిలించింది. దుందుభి మృతదేహాన్ని రుష్యమూక పర్వతంపై పడేయడాన్ని అక్కడే తపస్సు చేసుకుంటున్న మాతంగ ముని చూశాడు. ‘వాలి కనుక మళ్లీ ఈ పర్వతం మీద కాలు మోపాడో మరణిస్తాడు’ అంటూ మాతంగ ముని శపించాడు. తర్వాత కాలంలో సుగ్రీవుణ్ణి చంపడానికి వాలి సిద్ధమయ్యాడు. ఈ శాపోదంతం గురించి ముందే తెలిసిన సుగ్రీవుడు రుష్యమూక పర్వతానికి వెళ్లి దాక్కున్నాడు. ఆ సమయంలో సుగ్రీవుణ్ణి చూసేందుకు వచ్చిన హనుమంతుడు పంపా సరోవరాన్ని చూడాలనుకున్నాడు. హనుమ సరోవర తీరంలో తిరగడానికి అనువుగా ఒంటెను సిద్ధం చేశాడు సుగ్రీవుడు. అలా ఒంటె స్వామికి వాహనం అయ్యిందని కథనం.                -

బొగ్గరపు వెంకటేష్‌ ఎమ్‌.ఎన్‌


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని