పూతాత్మా

విష్ణుసహస్ర నామావళిలో ఇది పదో నామం. కర్మ ఫల దోషాలేవీ అంటని పవిత్ర ఆత్మ అని అర్థం. అంటే స్వరూపమున్న పవిత్రాత్ముడు. ఆ స్వామికి ఒకరి మీద ప్రేమ, ఇంకొకరి మీద ద్వేషం ఉండదు.

Updated : 11 Aug 2022 01:18 IST

విష్ణుసహస్ర నామావళిలో ఇది పదో నామం. కర్మ ఫల దోషాలేవీ అంటని పవిత్ర ఆత్మ అని అర్థం. అంటే స్వరూపమున్న పవిత్రాత్ముడు. ఆ స్వామికి ఒకరి మీద ప్రేమ, ఇంకొకరి మీద ద్వేషం ఉండదు. రాగ ద్వేషాల వంటి ద్వంద్వాలకు ఆయన అతీతుడు. భక్తుడు చేయాల్సిందల్లా ఈ విషయాన్ని గమనించి ఆ పవిత్రాత్ముణ్ణి నిర్మల భక్తితో కీర్తించటమని భావం.

- వై.తన్వి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని