శుభకామనలు

మన ఆచార వ్యవహారాల్లో శుభప్రద ఆకాంక్షలకు, ఆశీర్వచనాలకు ఉన్నత స్థానం ఉంది. మనస్ఫూర్తిగా అందించే దీవెనలు ఫలిస్తాయి. నైర్మల్యంతో, త్రికరణశుద్ధిగా ఉచ్చరించే పదాలు మంత్రాలవుతాయి. క్రియలుగా మార్పు చెందుతాయి. విత్తనాలు

Updated : 11 Aug 2022 01:17 IST

న ఆచార వ్యవహారాల్లో శుభప్రద ఆకాంక్షలకు, ఆశీర్వచనాలకు ఉన్నత స్థానం ఉంది. మనస్ఫూర్తిగా అందించే దీవెనలు ఫలిస్తాయి. నైర్మల్యంతో, త్రికరణశుద్ధిగా ఉచ్చరించే పదాలు మంత్రాలవుతాయి. క్రియలుగా మార్పు చెందుతాయి. విత్తనాలు నాటిన తర్వాత మంచి ఆలోచనలూ, నడవడికా ఉన్న వ్యక్తులు స్పృశించిన నీళ్లు చల్లితే అవి శీఘ్రగతిన మొలకెత్తాయని, మామూలు జలంతో పెరిగే మొక్కల కంటే ఏపుగా పెరుగుతా యంటారు పెద్దలు. ప్రతి దాంట్లో మనకు తెలియని విషయం ఏదో దాగి ఉందంటారు పెద్దలు. అది పంచభూతాలకూ వర్తిస్తుంది. మంత్రాలకు ప్రాథమిక ఆధారం ఇది. శుభభావనలతో కూడిన మంత్రం మన చుట్టూ గుణాత్మకమైన మార్పును కలగజేస్తుంది. గాయత్రీ తదితర మంత్రాల ఉచ్చారణతో ఒక ప్రత్యేక ఎలక్ట్రో డైనమిక్‌ ఫీల్డ్‌ ఏర్పడుతుంది. ఎంత అధిక సంఖ్యలో మంత్రం పునశ్చరణ చేస్తే అంతగా  ప్రభావం ఉంటుంది. విశ్వశాంతికి అదే మూలమవుతుంది.

- ప్రతాప వెంకట సుబ్బారాయుడు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని