Updated : 11 Aug 2022 01:15 IST

తుంటరి పరీక్ష

వివేకానంద పశ్చిమ అమెరికా పర్యటనలో భాగంగా ఓ సభలో ప్రసంగిస్తున్నారు. ఇంతలో ఒక విదేశీయుడు లేచి ‘మనం ప్రశాంతంగా ఉండాలంటే, అనుకున్నది సాధించాలంటే ఏం చేయాలి?’ అనడిగాడు. వివేకానంద చిన్నగా నవ్వి ‘మనోనిగ్రహం కావాలి. మనసు కనుక స్థిరంగా ఉంటే మన ప్రశాంతతకు బాహ్యపరిస్థితులు భంగం కలిగించలేవు’ అన్నారు. ఆ ప్రసంగం విన్న తుంటరి యువకులకు ‘వివేకానంద ఇలాంటి మాటలను చెప్పడమేనా? లేక ఆచరణలో పెడతారా’ అనిపించి, పరీక్షించాలను కున్నారు. ఒకరోజు ప్రసంగానికి ఆహ్వానించారు. బోర్లించిన తొట్టి మీద నిలబడి మాట్లాడమన్నారు. వివేకానంద అలాగే ప్రసంగిస్తూ, అందులో లీనమయ్యారు. ఇంతలో ఆ యువకులు స్వామీజీ చెవులు దద్దరిల్లేలా తుపాకీ గుళ్లు పేల్చసాగారు. వివేకానంద కాస్తయినా చలించకుండా ప్రశాంతంగా ఆరంభించిన ప్రసంగాన్ని అంతే శాంతంగా ముగించారు.

- బి.సైదులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని