నీళ్లు... సూది...

తిరువళ్లువార్‌ మహాభక్తుడు, జ్ఞాని. ఆయన ఎక్కువ సమయం భగవత్‌ సేవలో నిమగ్నమయ్యేవాడు. పెళ్లయిన కొత్తలోనే అతడు భార్యకు కొన్ని నియమాలూ నడవడికలు నేర్పాడు.

Published : 18 Aug 2022 01:12 IST

తిరువళ్లువార్‌ మహాభక్తుడు, జ్ఞాని. ఆయన ఎక్కువ సమయం భగవత్‌ సేవలో నిమగ్నమయ్యేవాడు. పెళ్లయిన కొత్తలోనే అతడు భార్యకు కొన్ని నియమాలూ నడవడికలు నేర్పాడు. వాటిలో ఒకటి భోజన సమయంలో విస్తరి పక్కన దొన్నె నిండా నీళ్లను, ఒక సూదిని ఉంచాలనే ఆదేశం. ఆ నియమాన్ని భార్య వాసుకి ఎన్నడూ తప్ప లేదు. కానీ భర్త వాటిని ఉపయోగించగా చూడలేదు. దాంతో ఒకరోజు ‘మీరు చెప్పినట్టుగా రోజూ నీళ్లూ, సూదీ ఉంచు తున్నాను కానీ ఒక్కరోజూ వాటిని వాడలేదు. మరి నేనలా అమర్చడం వల్ల ప్రయోజనం ఏమిటి?’ అనడిగింది. తిరువళ్లువార్‌ చిన్నగా నవ్వి ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం కదా! వ్యర్థం చేయకూడదు. నువ్వు వడ్డిస్తున్నప్పుడో, నేను తింటున్నప్పుడో పొరపాటున మెతుకులు కిందపడితే సూదితో తీసి, నీళ్లతో శుద్ధి చేసి ఆకులో వేసుకోవాలనేది నా ఉద్దేశం. కానీ ఎన్నడూ మెతుకు కింద పడలేదు, వాటిని ఉపయోగించే అవసరం రాలేదు’ అన్నాడు. ‘అవును, అన్నం పరబ్రహ్మ స్వరూపమే’ అనుకుందామె.

- బొగ్గరపు వెంకటేష్‌ ఎమ్‌.ఎన్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని