శివుడు వివరించిన శ్రీరామగీత

పరమాత్మ తత్త్వంతో పాటు ఆత్మతత్త్వాన్ని విపులీకరించిన గీత శ్రీరామ గీత. ఇది వాల్మీకి మహర్షి విరచిత ఆధ్యాత్మ రామాయణంలో ఉంది. లక్ష్మణుడి ధర్మసందేహాలకు శ్రీరాముడు చెప్పిన సమాధానాల సమాహారంగా పైకి కనిపిస్తుంది.

Published : 18 Aug 2022 01:22 IST

రమాత్మ తత్త్వంతో పాటు ఆత్మతత్త్వాన్ని విపులీకరించిన గీత శ్రీరామ గీత. ఇది వాల్మీకి మహర్షి విరచిత ఆధ్యాత్మ రామాయణంలో ఉంది. లక్ష్మణుడి ధర్మసందేహాలకు శ్రీరాముడు చెప్పిన సమాధానాల సమాహారంగా పైకి కనిపిస్తుంది. అయితే బ్రహ్మాండ పురాణంలో పార్వతీ పరమేశ్వర సంవాద రూపంలో కూడా ఇది కనిపిస్తుంది. ఒకసారి కైలాసపర్వతం మీద శివుడు సిద్ధసమూహాలతో ఉన్న సమయంలో పార్వతీదేవి భగవంతుడి సనాతన తత్త్వాన్ని వివరించమని అడిగింది. దాంతోపాటు ‘శ్రీరాముడు భగవంతుడు, పరబ్రహ్మస్వరూపుడు కదా! మరి మనిషిలా సీత కోసం ఎందుకు విలపించాడు?’ తదితర సందేహాలు వ్యక్తం చేసింది. వాటన్నింటికీ శివుడు సమాధానాలిచ్చాడు. ఆ సందర్భంలో పరమాత్మ తత్త్వంతో పాటు రామ తత్త్వాన్ని స్వయంగా శివుడు తేటతెల్లం చేశాడీ గీతలో. విశేషమేమంటే శైవ వైష్ణవ భేదాలు లేవని ప్రతిపాదించే విధంగా శివుడు వివరిస్తాడు.

- మల్లు, గుంటూరు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని