ఖురాన్‌ అమూల్యం

పూర్వం ఒక జంటకు సంతానం కలగలేదు. పిల్లల కోసం తపించేవారు. రాత్రింబవళ్లు అల్లాహ్‌ను వేడుకునేవారు. తమ కోరిక తీరితే ‘ఇహపరాల్లో విలువైన సంపదను ఆమెకి కానుకగా ఇస్తా’మని మొక్కుకున్నారు.

Published : 25 Aug 2022 00:55 IST

పూర్వం ఒక జంటకు సంతానం కలగలేదు. పిల్లల కోసం తపించేవారు. రాత్రింబవళ్లు అల్లాహ్‌ను వేడుకునేవారు. తమ కోరిక తీరితే ‘ఇహపరాల్లో విలువైన సంపదను ఆమెకి కానుకగా ఇస్తా’మని మొక్కుకున్నారు. అలా ప్రార్థించిన కొన్నాళ్లకే పండంటి పాప పుట్టింది. ఆ చిన్నారిని అపురూపంగా చూసుకుంటూ మురిసిపోయారు. కొన్నాళ్లకు మొక్కు సంగతి గుర్తొచ్చి ఇహపరలోకాల్లో విలువైన కానుకగా ఆమెకి ఏమివ్వాలనే సందేహం కలిగింది. ఆ సంగతి పండితులను అడిగారు. చివరికి ఇమామ్‌ షాఫయీ అనే మహనీయుణ్ణి కలిసి విషయం వివరించారు. దానికాయన ‘నీ బిడ్డను ఖురాన్‌కు అనుగుణంగా తీర్చిదిద్దు. పెళ్లిచేసి అత్తగారింటికి పంపేటప్పుడు ఖురాన్‌ను కానుకగా ఇవ్వు. ఇహపరాల్లో ఇంతకంటే అమూల్య సంపద లేదు’ అన్నారాయన.

- ముహమ్మద్‌ ముజాహిద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని