గురువులెందరో వివరించిన అవధూత గీత

అవధూతగీత భాగవతం పదకొండో స్కందలో ఉంది. శ్రీకృష్ణుడు తన అవతారాన్ని ముగించే సమయం దగ్గర పడిందని గ్రహించాడు. పూర్వం అవధూత రూపంలోనున్న దత్తాత్రేయస్వామికీ, యదు మహారాజుకూ మధ్య జరిగిన సంవాదాన్నే అవధూతగీతగా చెప్పాడు కృష్ణుడు.

Updated : 08 Sep 2022 01:04 IST

వధూతగీత భాగవతం పదకొండో స్కందలో ఉంది. శ్రీకృష్ణుడు తన అవతారాన్ని ముగించే సమయం దగ్గర పడిందని గ్రహించాడు. పూర్వం అవధూత రూపంలోనున్న దత్తాత్రేయస్వామికీ, యదు మహారాజుకూ మధ్య జరిగిన సంవాదాన్నే అవధూతగీతగా చెప్పాడు కృష్ణుడు. ఆ ఘట్టమే అవధూత యదు సంవాదంగా, అవధూతగీతగా ప్రసిద్ధి చెందింది. ఇరవై నలుగురు గురువులను, వారి జీవన విధానాలను కృష్ణుడు ఉద్ధవుడికి వివరించాడు.
గురు బోధలను గ్రహిస్తే, ఆ బోధలను విచారణ చేస్తే తనలా స్వేచ్ఛగా స్వతంత్ర జీవులుగా, చింతారహితులై, విషయాసక్తి లేకుండా ఉండొచ్చని, మానవ జన్మను సార్థకం చేసుకోవచ్చని అవధూతరూపంలో ఉన్న దత్తాత్రేయ స్వామి యదు మహారాజుకు చెప్పిన వాటిని కృష్ణుడు చక్కగా వివరించాడు ఈ గీతలో.

ఇరవైనలుగురు గురువులలో మొదటి ఐదు పంచభూతాలైన భూమి, వాయువు, ఆకాశం, జలం, అగ్ని, ఆరో గురువు చంద్రుడు, ఏడు సూర్యుడు, ఎనిమిది పావురం, తొమ్మిది కొండచిలువ, పది సముద్రం, పదకొండు మిడుత, పన్నెండు తేనెటీగ, పదమూడు మదించిన ఏనుగు, పద్నాలుగో గురువు తేనె తీసేవాడు. లేడి పదిహేనవది చేప పదహారోది, పింగళ అనే వేశ్య పదిహేడోది. లకుముకి పిట్ట పద్దెనిమిదోది. బాలుడు పంతొమ్మిదో వాడు. కన్య ఇరవయ్యో గురువు. బాణాలు తయారు చేసేవాడు ఇరవై ఒకటో వాడు. పాము, సాలీడు, కీటకం మిగిలిన ముగ్గురు గురువులు. ఇలా 24 మంది గురువులు ఉన్నారన్న విషయం ఈ గీత ద్వారా తెలియజేశారు. అంటే ప్రకృతిలో అనేక జీవరాశుల నుంచి, వాటి జీవన శైలి నుంచి మంచి విషయాలను గమనించి, జీవన శైలిని మెరుగు పరచుకోమంటూ అవధూత గీత బోధిస్తుంది. వృక్ష, క్రిమి, కీటకాదుల కంటే మనిషి జన్మ ఉత్తమమైందనే విషయాన్ని అవధూత గీత వివరిస్తోంది.

- మల్లు, గుంటూరు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు