చుట్టం.. వ్యాధి.. కర్మ

వయోభారం వల్ల రమణులకు మోకాళ్ల నొప్పులు వచ్చాయి. శిష్యగణం వంతుల వారీగా సేవచేస్తూ నొప్పిని ఉపశమింపచేయాలని ప్రయత్నిస్తున్నారు. రోజులు గడుస్తున్నా బాధ తగ్గకపోగా ఎక్కువవుతోంది. కాళ్లు పడుతున్న శిష్యులను చూస్తూ ‘ఇంటికి వచ్చిన చుట్టాన్ని పట్టించుకోకుంటే రెండు రోజులు చూసి వెళ్లిపోతాడు.

Published : 15 Sep 2022 00:43 IST

వయోభారం వల్ల రమణులకు మోకాళ్ల నొప్పులు వచ్చాయి. శిష్యగణం వంతుల వారీగా సేవచేస్తూ నొప్పిని ఉపశమింపచేయాలని ప్రయత్నిస్తున్నారు. రోజులు గడుస్తున్నా బాధ తగ్గకపోగా ఎక్కువవుతోంది. కాళ్లు పడుతున్న శిష్యులను చూస్తూ ‘ఇంటికి వచ్చిన చుట్టాన్ని పట్టించుకోకుంటే రెండు రోజులు చూసి వెళ్లిపోతాడు. మర్యాదలు చేస్తుంటే అతడిక తిరిగి వెళ్లడానికి బద్ధకిస్తాడు. మన జబ్బులూ అంతే. ఔషధాలు వాడుతూ జాగ్రత్తలు తీసుకున్న కొద్దీ మనల్ని విడిచి వెళ్లడానికి మొరాయిస్తాయి. అందుకే బంధువులనూ, రోగాలనూ కొంతవరకే పట్టించుకోవాలి. లేదంటే చూస్తున్నారుగా.. మీరెప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తాయి. చక్కగా రెండు పూటలా తైల మర్దనం చేయించుకుంటాయి. ఇది అర్థంచేసుకున్నారు కనుకనే ‘సాగుబాటు ఉంటే వ్యాధి అంత సుఖం లేదు’ అన్నారు పెద్దలు. మీరొక కోణంలో ఆలోచించి సేవ చేస్తుంటే... ‘తన కాళ్ల నొప్పులే పోగొట్టుకోలేని ఈ వృద్ధ గురువు మనల్నేం ఉద్ధరించేను?’ అనుకుని తలకు మించిన కోర్కెలతో వచ్చినవారు నన్ను విసిగించడం మానేస్తారు. ఆ విధంగా మేలే చేస్తున్నారనుకోండి. అదలా ఉంచితే.. ఈ నొప్పికి కారణం గత జన్మ కర్మలే తప్ప వేరొకటి కాదు. ఈ కర్మల్లో దేవుడి ప్రమేయం లేదని గ్రహించండి. మీరెంత సేవ చేసినా.. కర్మ ఫలం ముగిసేవరకూ నా నొప్పులు తగ్గవు. ఎవరైనా సరే కర్మను వదిలించుకుంటేనే విముక్తి కలుగుతుంది’ అంటూ చెప్పారు రమణ మహర్షి.

- లక్ష్మి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని