స్వప్న మర్మం

ఒక వ్యక్తి ముహమ్మద్‌ ప్రవక్త (స) వద్దకు వచ్చి ‘అయ్యా! రాత్రి నాకో కల వచ్చింది. మేఘాలు కమ్ముకున్న ఆకాశంలోంచి తేనె కురుస్తోంది. దాన్ని దోసిళ్లలో నింపుకుంటున్నారు.

Updated : 29 Sep 2022 04:50 IST

క వ్యక్తి ముహమ్మద్‌ ప్రవక్త (స) వద్దకు వచ్చి ‘అయ్యా! రాత్రి నాకో కల వచ్చింది. మేఘాలు కమ్ముకున్న ఆకాశంలోంచి తేనె కురుస్తోంది. దాన్ని దోసిళ్లలో నింపుకుంటున్నారు. కొందరు ఎక్కువ, కొందరు తక్కవ తీసుకుంటున్నారు’ అంటూ చెప్పాడు. అక్కడే ఉన్న అబూబకర్‌ (రజి) అనే శిష్యుడు కలగజేసుకుని ఆ కలను వివరించేందుకు అనుమతి కోరాడు. ప్రవక్త ఆమెదించడంతో ‘మేఘాలంటే ఇస్లామ్‌. కురుస్తున్న తేనె ఖురాన్‌ గ్రంథ మాధుర్యం. ప్రజలు సమానంగా తీసుకోలేదంటే ఖురాన్ని కొందరు ఎక్కువ, కొందరు తక్కువ కంఠస్థం చేయడం’ అని చెప్పడంతో అంతా సంతోషించారు.

- తహూరా సిద్దీఖా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని