Published : 29 Sep 2022 00:47 IST

పౌలు సందేశం

పోస్తలుడైన పౌలు న్యూటెస్ట్‌మెంట్‌లో రాసిన 14 లేఖలకు ఎంతో ప్రాముఖ్యత వుంది. ఆయన తన శిష్యుడు తిమోతికి ‘నువ్వు యవ్వనంలో కలిగే కోరికలను దూరం పెట్టు. ఎన్నడూ నమ్మకాన్ని కోల్పోకు. తోటి వారితో ప్రేమగా, జవాబుదారీగా ఉండు. తెలివిలేని మూఢుల మాటలు గొడవలు పుట్టిస్తాయని గ్రహించి, అలాంటివారికి దూరంగా ఉండు. అందరితో సౌమ్యంగా ప్రవర్తించు. సదా శాంతంగా, ఏ విషయంలోనూ అతి లేకుండా ఉండటం అలవాటు చేసుకో’ అంటూ లేఖ రాశారు. యువత ఈ సత్ప్రవర్తనను అలవరచుకోవడం వల్ల మన జీవితాలు సుఖసంతోషాలతో వర్ధిల్లడమే కాదు ఇతరుల మన్నన పొందగలం.

- ప్రశాంత్‌.జి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని