మతాన్నే అంటిపెట్టుకో

కొందరు ఇతరుల ప్రలోభానికి లోబడి మత మార్పిడికి సిద్ధపడు తుంటారు. ఆనక అందులో ఇమడలేక మనశ్శాంతి కోల్పోవడం, విరక్తి చెందడం జరుగుతుంది. అందుకు దృష్టాంతంగా చెప్పుకునే ఓ కథ ఉంది...

Updated : 29 Sep 2022 04:37 IST

కొందరు ఇతరుల ప్రలోభానికి లోబడి మత మార్పిడికి సిద్ధపడుతుంటారు. ఆనక అందులో ఇమడలేక మనశ్శాంతి కోల్పోవడం, విరక్తి చెందడం జరుగుతుంది. అందుకు దృష్టాంతంగా చెప్పుకునే ఓ కథ ఉంది...

ఒక వ్యక్తి పంట పొలానికి బావి తవ్వుదామనుకున్నప్పుడు ఫలానా చోట తవ్వమని చెప్పారొకరు. 20 అడుగులు తవ్వినా నీళ్లు పడలేదు. వేరొకరి సలహాతో మరోచోట పాతిక అడుగులు తవ్వాడు. నీళ్లు పడలేదు. మూడో వ్యక్తి చెప్పిన చోట 30 అడుగులు తవ్వినా లాభంలేక నిరాశచెందాడు. ఇంతలో నాలుగోవ్యక్తి నవ్వి ‘నాయనా! తప్పు దారి పట్టడం వల్ల నీ ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. నేను చెప్పిన చోట తవ్వి చూడు!’ అంటూ కొంత దూరం తీసికెళ్లి ‘ఇక్కడ ఐదడుగులు తవ్వితే చాలు నీళ్లు పడతాయి’ అన్నాడు. కానీ అప్పుడు కూడా నిరాశే ఎదురైంది. అతడు నాలుగు చోట్ల 80 అడుగులు తవ్వాడు. అలా కాకుండా ఓకేచోట ఓపిగ్గా, పట్టుదలగా అందులో సగం లోతు తవ్వినా నీళ్లు పడేవి. నమ్మిన దేవుడు ఆశించింది ఇవ్వలేదంటూ మతం మారడం ఇలాంటిదే. ఒకదాన్ని నమ్ముకుని స్థిరంగా ఉంటే లక్ష్యసాధన తేలికవుతుంది.

- గోవిందం ఉమామహేశ్వర రావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని