ప్రకాశించే కిరీటం

ఖురాన్‌ దృఢమైన తాడు. దాన్ని పట్టుకుంటే దైవంతో సంబంధం పటిష్టమవుతుంది, వదిలిపెడితే బంధం తెగిపోయినట్లే. ఖురాన్‌ను ఏకాగ్రతతో చదవాలి. చదివినవారు మననం చేస్తుండాలి.

Published : 20 Oct 2022 00:16 IST

ఖురాన్‌ దృఢమైన తాడు. దాన్ని పట్టుకుంటే దైవంతో సంబంధం పటిష్టమవుతుంది, వదిలిపెడితే బంధం తెగిపోయినట్లే. ఖురాన్‌ను ఏకాగ్రతతో చదవాలి. చదివినవారు మననం చేస్తుండాలి. ‘ఎవరైతే ఖురాన్‌ పఠిస్తారో ఆ వ్యక్తి తల్లిదండ్రులకు ప్రళయం రోజున దేదీప్యమానంగా ప్రకాశించే కిరీటాన్ని తొడుగుతారు. ఇక ఖురాన్‌ బోధలకు అనుగుణంగా నడుచుకునే వారిపై అల్లాహ్‌ కరుణా కటాక్షాలు ఎలా ఉంటాయో మీరే ఊహించుకోండి’ అంటూ చెప్పారు ముహమ్మద్‌ ప్రవక్త. ఆయన ఖురాన్‌ వేగంగా చదివేవారు కాదు. ఒక్కో పదాన్ని నిదానంగా చదివేవారు.

- అస్మత్‌ బేగం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు