చెప్పేదొకటి చేసేదొకటి

ప్రళయ దినాన ఒక వ్యక్తిని అగ్ని గుండంలోకి తోసేస్తారు. అప్పుడతని పేగులు బయటపడతాయి. అతడు వాటిని పట్టుకుని చుట్టూ తిరుగు తుంటాడు.

Published : 10 Nov 2022 00:36 IST

ప్రళయ దినాన ఒక వ్యక్తిని అగ్ని గుండంలోకి తోసేస్తారు. అప్పుడతని పేగులు బయటపడతాయి. అతడు వాటిని పట్టుకుని చుట్టూ తిరుగు తుంటాడు. అది చూసి ఇతర నరకవాసులు ‘అయ్యో ఇలా అయ్యిందా? బతికున్న రోజుల్లో మాకు మంచిని బోధిస్తూ చెడు వద్దని వారించేవాడివి. అంతా మంచే చేసినా నీకీ గతి పట్టిందేమిటి?’ అనడుగుతారు. దానికతడు ‘మీకు నీతులు చెప్పిన మాట నిజమే కానీ నేను మాత్రం చెడు పనుల్లోనే లీనమయ్యాను’ అన్నాడు. ఆ మాటలకు వాళ్లు ఆశ్చర్యపోయారు. ముహమ్మద్‌ ప్రవక్త ప్రబోధల్లోని ఈ ఉదంతం ఎందరికో చెంపపెట్టు. చాలామంది చెప్పేదొకటి, చేసేదొకటిలా ఉంటుంది. ‘మీరు ఆచరించని వాటిని ఇతరులకు ఎందుకు చెబుతారు? సన్మార్గంలో నడవమని ఇతరులకు ఉపదేశిస్తారు కానీ మిమ్మల్ని మీరు మర్చిపోతారా?’ అని ఖురాన్‌ హెచ్చరిస్తోంది..

- ముహమ్మద్‌ ముజాహిద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని