శివలింగం అర్థం.. పరమార్థం..
వేలసార్లు శివలింగాన్ని చూసి ఉంటారు కానీ అందులోని అర్థం ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా?! పానవట్టం(లింగపీఠం) పైన లింగం ఉంటుంది. భార్యాధర్మం కలిగిన ప్రకృతి పానవట్టం. అంటే లింగరూప పురుషుడనే భర్తకు ఆమె అక్షం లేదా ఇరుసు. ధ్యానంలో ఉన్నపుడు చెడు ఆలోచనలు ముసిరితే అమ్మవారి నాభిలో శివలింగం ఉన్నట్లు భావించాలి. అప్పుడా చెడు ఫలితం ఉండదు. కొంత లింగభాగం పానవట్టంలో, మిగిలిన భాగం పైన ఉంటుంది. దీనర్థం పరమాత్మ సర్వ జీవుల్లో, ప్రకృతి బయటా కూడా వ్యాపించి ఉన్నాడని. ప్రకృతి-పురుషుల కలియకే జగత్తుకు మూలమని మనకి స్పష్టం చేస్తుంది శివలింగం. జలం ప్రాణాధారం కనుక లింగానికి జలాభిషేకం చేస్తారు. అలా పడే ప్రతి నీటిబొట్టూ జీవులుగా రూపం తీసుకుని పానవట్టమనే పార్వతీదేవి ఒడిలో పోషణ పొంది, వృద్ధిచెంది చివరికి కాలం సమీపించాక కిందికి జారి తనువును చాలిస్తున్నాయి. అలా జీవుల సృష్టి, పోషణ, వృద్ధి, మరణాలకు శివలింగం ప్రతీక.
శివుడి నుదుటిమీద మూడు విభూతి రేఖలకు ఆధ్యాత్మిక అర్థముంది. ఈ పుండ్రములు క్షర, అక్షర, పురుషోత్తమ అనే మూడు రూపాల్లో ఉంటాడు. క్షరులంటే జీవులు. మరణం కలిగినవారు. అక్షరమంటే నాశనం లేని ఆత్మ. ఇక పురుషోత్తముడు సాక్షాత్తు భగవంతుడే. శివుడి మూడు అడ్డ నామాల వెనుకున్న రహస్యమిదే. వీటిలో పై రేఖ పరమాత్మను, మధ్య రేఖ సర్వ వ్యాపకమైన ఆత్మను, కింది రేఖ జీవాత్మలను సూచిస్తాయి. తెల్లని విభూతి ఆత్మ స్వచ్ఛమైనదని తెలియజేస్తుంది. ఆత్మ, పరమాత్మలు అన్నింటా ఉంటాయని చెప్పడానికి మధ్యరేఖకు నడుమ కుంకుమ లేదా చందనపు బొట్టును అలంకరిస్తారు.
- పద్మజ
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
సహజీవనం చేస్తూ హతమార్చాడు: తల్లీకుమార్తెలను గునపంతో కొట్టి చంపిన ప్రియుడు
-
Sports News
Sunil Gavaskar: బ్రిస్బేన్ పిచ్ గురించి మాట్లాడరేం?
-
Politics News
Bhuma Akhila Priya: నంద్యాల ఎమ్మెల్యే ఇన్సైడర్ ట్రేడింగ్: భూమా అఖిలప్రియ
-
Politics News
YSRCP: వచ్చే ఎన్నికల్లో పోటీచేయను: వైకాపా ఎమ్మెల్యే సుధాకర్
-
Politics News
Andhra News: నీతో మాట్లాడను, వెళ్లవమ్మా.. వెళ్లు!: మహిళపై వైకాపా ఎమ్మెల్యే అసహనం
-
Ap-top-news News
AP Govt: రాజధాని కేసులను త్వరగా విచారించండి: సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ