Updated : 14 Dec 2022 11:37 IST

శాకాహార మొసలి

హిందూ ధర్మంలో భక్తి, ఆహారాల ప్రస్తావన ఉంది. సన్యాసులు రుచుల మీద ఎలాంటి వ్యామోహం లేక శరీరాన్ని నిలుపుకోవడానికి అవసరమైనంత ఆహారమే తీసుకుంటారు. ఇతరులు షడ్రుచులను జయించలేకపోయినా, ఏకాదశి, శివరాత్రి లాంటి విశేష దినాల్లో ఉపవాసం లేదా ఆహార నియమాలు పాటిస్తారు. రుచులను ఆస్వాదించేటప్పుడు తనకు ఆహార కొరత లేనందుకు పరమాత్మకు కృతజ్ఞత తెలియజేయాలి. అన్నాన్ని వృథా చేయక పరబ్రహ్మ స్వరూపంగా భావించాలి. రోజూ పిడికెడు అన్నాన్ని జీవరాశులకు భక్తిగా సమర్పించాలి. ఫలాపేక్ష లేకుండా పత్రం, పుష్పం, ఫలం లేదా నీళ్లు అర్పిస్తే తాను సంతోషంగా స్వీకరిస్తానన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. శతాబ్దాల క్రితం శ్రీకాళహస్తిలో ప్రతిఫలాపేక్ష లేని సాలీడు, సర్పం ఏనుగులు భక్తిని ప్రదర్శించి శివైక్యం చెందాయి. ఇటీవల అనంత పద్మనాభస్వామి ఆలయ పుష్కరిణిలో మాంసాహార జంతువైన మొసలి దాదాపు 70 ఏళ్లు దేవుడి ప్రసాదమే స్వీకరించడం, గురువాయూర్‌ శ్రీకృష్ణ ఆలయంలో భారీ ఏనుగు స్వామివారి సేవలో తరించి ప్రతి ఏకాదశికీ భక్తితో ఉపవాసం చేసి ఆశ్చర్యం కలిగించాయి.                
 

- పరాశరం సచ్చిదానందమూర్తి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని