తిండి ప్రభావం
ఒకసారి సత్యసాయిబాబా తిండిని బట్టి మనుషుల ప్రవర్తన ఉంటుందంటూ ఒక కథ చెప్పారు. మహాభారత యుద్ధంలో కౌరవ సేనాధిపతి భీష్ముణ్ణి అర్జునుడు పడగొట్టాడు. దాంతో అంపశయ్య చేరిన భీష్ముడు తండ్రి ఇచ్చిన స్వచ్ఛంద మరణ వర ప్రభావంతో భౌతికకాయాన్ని విడిచి సద్గతి పొందేందుకు ఉత్తరాయణం కోసం నిరీక్షిస్తున్నాడు. కౌరవులు, పాండవుల మధ్య యుద్ధం తాత్కాలికంగా నిలిచింది. భీష్ముడు పాండవులకు జ్ఞానబోధ చేయడం చూసి ద్రౌపది ఫక్కున నవ్వింది. అందుకు పాండవులు కోపోద్రిక్తులయ్యారు.
కారణం లేకుండా అలా ప్రవర్తించదు అనుకున్న భీష్ముడు వారిని శాంతపరిచాడు. ద్రౌపదిని అనునయంగా పిలిచి నవ్వుకు కారణమడిగాడు. దానికామె ‘నిండు సభలో కౌరవులు నన్ను అవమానిస్తున్నప్పుడు ఒక్క మాటైనా మాట్లాడని మీరు నిరంతరం ధర్మాన్ని అనుసరించే వారిలా యుద్ధం చేస్తున్న నా భర్తలకు ధర్మాన్ని బోధిస్తుంటే నవ్వు ఆపుకోలేక పోయాను’ అంది.
భీష్ముడు మందహాసంచేసి ‘నువ్వు చెప్పింది నిజమే. కానీ అప్పుడు నేను దుర్యోధనుడి రాజాస్థానంలో ఉద్యోగిగా అతడి తిండితో కలుషితమయ్యాను. అందువల్ల అతడి భావాలైన స్వార్థం, అహంకారం, నిర్దయ, అధర్మం నా రక్తంలో విలీనమయ్యాయి. ఇప్పుడు అర్జునుడు వదిలిన బాణంతో ఆ కలుషిత రక్తం, దాంతోపాటు ఆ అవలక్షణాలూ బయటకు వచ్చేశాయి. నేనిప్పుడు సహజసిద్ధ గుణాలతో ధర్మ విషయాలను బోధించటానికి తగిన అర్హతలతో ఉన్నాను’ అన్నాడు.
- కె.వి.యస్.యస్.శారద
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
US-Mexico: భారతీయుడైతే 21 వేల డాలర్లు
-
Crime News
Andhra News: ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య.. ఘటనాస్థలానికి వెళ్లిన వార్డెన్ హఠాన్మరణం
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
PV Sindhu: ఆ స్వర్ణం కోసం అయిదేళ్లు ఎదురుచూశా: పీవీ సింధు
-
Politics News
YSRCP: ప్రతి ఇంటికీ జగన్ స్టిక్కర్!
-
Crime News
సహజీవనం చేస్తూ హతమార్చాడు: తల్లీకుమార్తెలను గునపంతో కొట్టి చంపిన ప్రియుడు