మహా దివ్య మంత్రం

ఇహ, పర సాధనలో గాయత్రీ మంత్రం తలమానికం. ఈ మంత్రోపాసన వల్ల జీవాత్మ దివ్యశక్తులూ పొంది పరమాత్మ స్వరూపం అవుతుంది.

Published : 17 Nov 2022 00:33 IST

ఇహ, పర సాధనలో గాయత్రీ మంత్రం తలమానికం. ఈ మంత్రోపాసన వల్ల జీవాత్మ దివ్యశక్తులూ పొంది పరమాత్మ స్వరూపం అవుతుంది. ఆయురారోగ్యాలు, భోగ భాగ్యాలు, యశోకీర్తులు లభిస్తాయని, బ్రహ్మ సాక్షాత్కారం కలుగు తుందని అధర్వవేదం చెబుతోంది. విలువిద్య నేర్చినంత నిష్ఠగా గాయత్రీ మంత్ర అనుష్ఠానం గురించి ముండకోపనిషత్తు తెలియజేసింది. ఈ 24 అక్షరాల మహిమాన్విత సమాహారంలో 11 అక్షరాలు ఏకాదశ రుద్రులకు, 8 అష్ట వసువులకు, 5 నక్షత్రాలకు అన్వయం. ప్రణవ ఓంకార నాదంతో గాయత్రీ మంత్రోపాసనకు శ్రీకారం చుడతారు.

ఓమ్‌ భూర్‌ భువః సువః తత్‌ సవితుర్‌ వరేణ్యం
భర్గో దేవస్య ధీమహీ
ధియో యోనః ప్రచోదయాత్‌!

అకార ఉకార మకారాల అపూర్వ సంకలనమైన ఓంకారం బ్రహ్మను, జీవుణ్ణి, ప్రకృతిని, త్రిమూర్తులను, త్రికాలాలను, త్రివేణీ తీర్థాలను సూచిస్తోంది. అలాగే ఆధిభౌతిక, ఆధ్యాత్మిక, ఆధిదైవిక అనే తాపత్రయానికి సంకేతం.

- ఉప్పు రాఘవేంద్ర రావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని