ప్రేమగా ఉండండి!

దయామయుడిగా ప్రేమస్వరూపిగా ఈ లోకంలో జీవించాడు క్రీస్తు. కలువరి గిరిపై తన ప్రాణాన్ని అర్పించి నిస్వార్థ ప్రేమ ఎలా ఉంటుందో రుజువు చేశాడు.

Published : 17 Nov 2022 00:37 IST

దయామయుడిగా ప్రేమస్వరూపిగా ఈ లోకంలో జీవించాడు క్రీస్తు. కలువరి గిరిపై తన ప్రాణాన్ని అర్పించి నిస్వార్థ ప్రేమ ఎలా ఉంటుందో రుజువు చేశాడు. దైవ గ్రంథం బైబిల్‌లో ప్రేమను నిర్వచించే ఉదాహరణలెన్నో ఉన్నాయి. ‘ప్రేమ అనేక పాపాలను కప్పిపెడుతుంది. కనుక మీరు అందరితో ప్రేమగా ఉండండి’ అన్నాడో సందర్భంలో. ‘మనసులో ఎలాంటి స్వార్థం లేకుండా ఒకరికొకరు ఆతిథ్యం ఇచ్చిపుచ్చుకోండి’ అంటూ చెప్పాడు మరోసారి. తోటివారికి సాధ్యమైనంత మేరకు సహాయం చేయడమే క్రీస్తు తత్వం. కోపం, ద్వేషం, అసూయ లేకుండా సహోదరభావంతో కలిసి ఉండాలన్నదే ఆయన బోధ.

- అపరంజి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని