ఉత్తమ దానం

దానాల్లో ఏది గొప్పదని అడిగిన శిష్యుడికి ముహమ్మద్‌ ప్రవక్త (స) వివరంగా సమాధానమిచ్చారు.

Updated : 24 Nov 2022 00:28 IST

దానాల్లో ఏది గొప్పదని అడిగిన శిష్యుడికి ముహమ్మద్‌ ప్రవక్త (స) వివరంగా సమాధానమిచ్చారు. ‘నువ్వు ఆరోగ్యంగా ఉండి, ధన వ్యామోహంలో ఉన్నప్పుడు, కొంత పెట్టుబడి పెడితే లాభం వస్తుందన్న ఆశాభావం, ఖర్చుపెడితే పేదరికం దాపురిస్తుందన్న భయం ఉన్నప్పుడు చేసే దానం అన్నింటికన్నా మేలైంది. ప్రాణం పోయే స్థితిలో ఫలానావారికి ఇంత, ఫలానావారికి అంత ఇవ్వమని చెప్పాల్సిన పరిస్థితి రానీయొద్దు. ఎందుకంటే అప్పుడది ఎటూ ఫలానావారిదైపోయింది. నువ్వేమో ఈ లోకాన్ని వీడిపోతావు’ అన్నారు. మరోసారి ఒక సహచరుడు ‘మా అమ్మ ఆకస్మికంగా చనిపోయింది. నాతో మాట్లాడే అవకాశముంటే దానం చేయమని చెప్పేది. ఇప్పుడామె తరపున నేను దానం చేయొచ్చా?’ అనడిగాడు. ‘నిజమే, ఆమె తరపున దానం చెయ్యి’ అన్నారు ప్రవక్త.

- తహూరా సిద్దీఖా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని