సంసారం - సన్యాసం

ఒకసారి గోవింద చందోర్కర్‌ తనను సంసార బంధాల నుంచి విముక్తుణ్ణి చేయమని సాయిని కోరాడు.

Updated : 24 Nov 2022 05:02 IST

కసారి గోవింద చందోర్కర్‌ తనను సంసార బంధాల నుంచి విముక్తుణ్ణి చేయమని సాయిని కోరాడు. దానికి బాబా ‘విధి, కర్మ నిరంతరం మనల్ని ఆడిస్తుంటాయి. మనమెంతో ఇష్టపడి కొన్న వస్తువే కొన్నాళ్లకి వెగటుగా తోస్తుంది. అందుకే బుద్ధిమంతులు వస్తు సంచయం పట్ల ఆసక్తి చూపరు. రెండు భిన్నత్వాల కలయికే సంసారం. వీటి వియోగం లేదా వికల్పం సన్యాసం. మరోలా చెప్పాలంటే మనసు కోరిన వస్తువును దేహం అనుభవిస్తోంది. అలా కాకుండా మనసును నియంత్రించి వస్తువాంఛకు దూరంగా ఉండటమే సన్యాసం. కోరిక లేనప్పుడు వస్తువుతో పనిలేదు. అప్పుడిక దేహానికి ఆ వస్తువు తాలూకు సుఖసౌఖ్యాలు పట్టవు. సంసార బంధాలను తెంచుకోడానికి ఈ సూత్రాన్ని అనుసరించాలే కానీ ఆశ్రమానికో అడవులకో వెళ్లడం కాదు. దేహం ఉన్నంతవరకు సంసారం ఉంటుంది. ధనికుల శునకం రాజభోగాలు అనుభవించడం, వీధికుక్క రొట్టెముక్క కోసం నిత్యం కష్టపడటం వెనుకున్నది పూర్వజన్మ కర్మలూ, ఫలితంగా ప్రస్తుతం అనుభవిస్తున్న కష్టసుఖాలే’ అంటూ వివరించడంతో చందోర్కర్‌కి జ్ఞానోదయమైంది.

- ఉమాబాల


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని