త్రిమూర్తులే దత్తాత్రేయుడిగా..
విష్ణుమూర్తి 11వ అవతారం దత్తాత్రేయుడు, 12వ అవతారం వ్యాసుడు. జ్ఞానమార్గాన్ని అర్థం చేసుకోవడానికి, యోగోపదేశం చేయడానికి ఆవిర్భవించాడు దత్తాత్రేయుడు.
డిసెంబరు 7 దత్త జయంతి
విష్ణుమూర్తి 11వ అవతారం దత్తాత్రేయుడు, 12వ అవతారం వ్యాసుడు. జ్ఞానమార్గాన్ని అర్థం చేసుకోవడానికి, యోగోపదేశం చేయడానికి ఆవిర్భవించాడు దత్తాత్రేయుడు. ఎంత జ్ఞానికైనా యోగం లేకుంటే ముక్తి లభించదు. సత్వ, రజో, తమో గుణాలను విడిచిపెట్టినవారికి తానే స్వయంగా యోగ మార్గం ఉపదేశిస్తానన్న దత్తత్రేయడు మార్గశిర మాసం శుక్ల చతుర్దశి, బుధవారం, కృత్తికా నక్షత్రంలో జన్మించాడు. ఈసారి దత్తజయంతి అవే వార, నక్షత్రాల్లో రావడం విశేషం. దత్తుడికి ఆరు చేతులు, మూడు శిరస్సులు. త్రిమూర్తులకు ప్రత్యక్ష రూపం దత్తాత్రేయుడు. మధ్య శిరస్సు విష్ణువుది, ఎడమ శిరస్సు బ్రహ్మది, కుడి శిరస్సు శివుడిది. దీన్ని మరోవిధంగా కూడా నిర్వచిస్తారు. త్రిమూర్తులకు భేదం లేదని గ్రహించినవారిని దత్తాత్రేయ రూపంలో త్వరితగతిన అనుగ్రహిస్తాడనేది మూడు శిరసుల్లో దాగిన అంతరార్థం. ఆరు చేతులు సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, మీమాంస, వేదాంతాలనే తత్వ శాస్త్రాలకు సంకేతం. మేడి దత్తునికి ప్రియమైన చెట్టు. దీని ఆకులు, కాండం, పండ్లు, దాన్నుంచి వచ్చే గాలి- అన్నీ ఔషధప్రాయమే. ఏ జీవులకేది కావాలో ఈ ఔదుంబర వృక్షం అందించినట్లు ఎవరికేది అవసరమో దాన్ని అనుగ్రహిస్తాడు దత్తాత్రేయుడు.
డా. జయదేవ్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
SAFF U19 Championship: నేపాల్‌ను ఓడించిన భారత్.. ఫైనల్లో పాకిస్థాన్‌తో ఢీ
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Jawan: ‘జవాన్’ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. ఆ మూడు రోజులే!
-
Pakistan-New Zealand: హైదరాబాద్ చేరుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు
-
Amaravati: ఏపీ సచివాలయంలో 50 మంది అసిస్టెంట్ సెక్రటరీలకు రివర్షన్
-
Law Commission: ‘జమిలి’ నివేదికపై కసరత్తు జరుగుతోంది.. లా కమిషన్ ఛైర్మన్