రెండు ‘నేను’లు

ఒకసారి ముక్తిమోక్షాలను పొందే మార్గం చెప్పమని అడిగాడో శిష్యుడు. దానికి రమణులు ‘ప్రతి వ్యక్తిలో రెండు నేనులు ఉంటాయి. ఒకటి మిథ్యా నేను, రెండోది సత్యపు నేను.

Updated : 01 Dec 2022 04:31 IST

ఒకసారి ముక్తిమోక్షాలను పొందే మార్గం చెప్పమని అడిగాడో శిష్యుడు. దానికి రమణులు ‘ప్రతి వ్యక్తిలో రెండు నేనులు ఉంటాయి. ఒకటి మిథ్యా నేను, రెండోది సత్యపు నేను. మనకి జ్ఞానం కలగనంతవరకు మిథ్యా నేను పెత్తనం ఉంటుంది. మనం ఎవరంటూ సాధన చేసిన తర్వాత మిథ్యా నేను పారిపోతుంది. ఇక ఆ స్థానాన్ని సత్యపు నేను చేతిలోకి తీసుకుంటుంది. ముక్తి మోక్షం అనేవి మనం చనిపోయిన తర్వాత పై లోకాల కోసం తపనపడి సాధించే వస్తువులు కాదు. మిథ్యా నేనును జయించి సత్యమైన నేనును సాధించిన రోజే అసలైన జన్మనెత్తినట్లు. అదే ముక్తి మోక్షం కలిగిన రోజు. దీన్నే చచ్చి సాధించడం అంటారు. ఇక్కడ చావంటే భౌతికమైంది కాదు. అహంతో నిండిన మిథ్యా నేను సంహరణ అని గ్రహించాలి. అలా జీవించేవారినే జీవన్ముక్తులంటారు. కోరికలు నశించనంతవరకు ఈ మిథ్యా నేను తొలగదు కనుక ముందా పనిలో ఉండాలి. మోక్షమంటే ఒకరు పొట్లం కట్టిచ్చే మిఠాయి కాదు. అది మనలోనే, మనతోనే ఉంటుంది. మనసులో చెడుభావనలూ ప్రలోభాలను తుడిచిపెట్టేస్తే అదే ముక్తి మోక్షం’ అంటూ వివరించారు.

లక్ష్మి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు