ఏది పాపం.. ఏది పుణ్యం..

దేవుడు మనకిచ్చిన బహుమతి విచక్షణ. దేన్నయినా పరిశీలించి, పరిశోధించి ఒక నిర్ణయానికి రావడమే విచక్షణ అని పరిశుద్ధ గ్రంథం బైబిల్‌ మనకు తెలియజేస్తోంది.

Updated : 14 Dec 2022 11:16 IST

దేవుడు మనకిచ్చిన బహుమతి విచక్షణ. దేన్నయినా పరిశీలించి, పరిశోధించి ఒక నిర్ణయానికి రావడమే విచక్షణ అని పరిశుద్ధ గ్రంథం బైబిల్‌ మనకు తెలియజేస్తోంది.

మాట్లాడేటప్పుడు మంచి మాటలే మాట్లాడాలి. సరైన నిర్ణయాలు తీసుకోవాలి. యేసు ప్రబోధలకు అనుగుణంగా నడుచుకుంటే ఏ ఇబ్బందీ రాకుండా ఆయనే రక్షిస్తాడు. మేలైనవి అని తెలిసి కూడా వాటిని అమలుచేయని వారికి పాపం కలుగుతుంది అంటోంది బైబిల్‌. అంటే ఏది మంచిదో ముందు తెలుసుకోవాలి. అందుకోసం జ్ఞానం సంపాదించాలి. అప్పుడు ఆలోచనాపటిమ పెరుగుతుంది. జ్ఞానాన్ని పెంచుకున్నకొద్దీ విచక్షణ పెరుగుతుంది. మంచేదో, చెడేదో సులభంగా తెలుసుకోగలం. ఈ క్రమంలో ఒకరికి హాని కలిగిస్తాయనుకున్న ఆలోచనలను వదిలేయాలి. అలాంటి మార్గాన్ని అనుసరించకుండా జాగ్రత్తపడాలి. మనం ఇతరులకు మేలు చేయాలి, ఫలితంగా పరలోకరాజ్యం చేరాలన్నదే ఈ వాక్య ఉద్దేశం.
పూసపాటి  విజయరాజు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని