రామాఫలం సీతాఫలం

భక్తి, జ్ఞాన మార్గాల మధ్య ఉన్న తేడా ఏమిటో వివరించమని సాయిని అడిగాడో భక్తుడు. అప్పుడు బాబా ‘భక్తి సీతాఫలం అయితే జ్ఞానం రామాఫలం వంటిది.

Published : 01 Dec 2022 01:03 IST

భక్తి, జ్ఞాన మార్గాల మధ్య ఉన్న తేడా ఏమిటో వివరించమని సాయిని అడిగాడో భక్తుడు. అప్పుడు బాబా ‘భక్తి సీతాఫలం అయితే జ్ఞానం రామాఫలం వంటిది. రామాఫలం చెట్టున పండినప్పుడే రుచినిస్తుంది. పక్వానికి రాకముందు రాలిపడితే మాధుర్యం ఉండదు సరికదా పాడైపోతుంది. దీని అర్థం జ్ఞానం సంపాదించే మార్గంలో సాధకుడు ప్రలోభాలకు చలించి పతనమైతే రామాఫలం నేల రాలిన చందాన వ్యర్థమైనట్లే. రామాఫలంలో గుజ్జు లోపల దాగి ఉంటుంది. శ్రమతోనే ఆ తియ్యని గుజ్జును ఆస్వాదించగలం. సీతాఫలం అలా కాదు. దానిలో గుజ్జు ఉపరితలంలోనే ఉంటుంది. సులభంగా తినొచ్చు. ఇది ముందుగా రాలినా పాడవదు. మగ్గపెడితే మరింత తీపిని సంతరించుకుంటుంది. సీతాఫలాన్ని భక్తితో సరిపోల్చవచ్చు. విప్రనారాయణుడు ఇందుకు ఉదాహరణ. జ్ఞానమార్గం కష్టతరం, భక్తిమార్గం సులభం’ అంటూ చక్కటి ఉపమానాలతో బోధపరిచాడు.        

 పద్మజ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని