అల్లాహ్‌ ప్రేమ అపారం

ఓ సందర్భంలో ముహమ్మద్‌ ప్రవక్త ‘ఒక ఒంటె ఎడారిలో తప్పిపోయింది. దాని యజమాని తెచ్చుకున్న అన్నపానీయాలు కూడా ఆ ఒంటె మీదనే ఉన్నాయి.

Published : 08 Dec 2022 00:45 IST

ఓ సందర్భంలో ముహమ్మద్‌ ప్రవక్త ‘ఒక ఒంటె ఎడారిలో తప్పిపోయింది. దాని యజమాని తెచ్చుకున్న అన్నపానీయాలు కూడా ఆ ఒంటె మీదనే ఉన్నాయి. దాని కోసం కాళ్లరిగేలా తిరిగినా లాభంలేక దిగులుగా కూర్చున్నాడు. అలాంటి పరిస్థితిలో తప్పిపోయిన ఒంటె కళ్లముందు ప్రత్యక్షమైంది. ఇక అతడి సంతోషానికి హద్దులు లేవు. సంతోషంతో పొంగిపోయాడు. మీలో ఎవరైనా ధర్మమార్గం తప్పి పాపభావనతో పశ్చాత్తాపం చెందిన తరుణంలో అల్లాహ్‌ మీమీద కరుణ చూపితే.. ఆ ఒంటె యజమాని కంటే ఎక్కువుగా సంతోషిస్తారు. తెలిసో తెలియకో తప్పులు చేస్తుంటాం. వాటివల్ల జరిగిన అనర్థాలకు కుంగిపోనవసరం లేదు. వందలమంది తల్లుల వాత్సల్యం కంటే అల్లాహ్‌ ప్రేమ అధికం. సృష్టిలో అమ్మ ప్రేమకు మించింది లేదంటారు. అలాంటిది అందరు తల్లుల ప్రేమ ఎంత అపారమో కదా! అందుకే ఆ దయామయుడి ప్రేమ ఎలాంటి నిరాశనైనా రూపుమాపుతుంది’ అంటూ ఉద్బోధించారు.
ఖైరున్నీసాబేగం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని