సస్యశ్యామలం వెనుక

ఉత్తర కాండం 41, 42 సర్గల్లో ‘రాముడి పాలనలో వర్షాలు సకాలంలో కురుస్తున్నాయి. ప్రజలకు ఈతిబాధలు లేవు. స్త్రీలు ఆరోగ్యవంత మైన బిడ్డలకు జన్మ ఇస్తున్నారు.

Updated : 15 Dec 2022 06:11 IST

ఉత్తర కాండం 41, 42 సర్గల్లో ‘రాముడి పాలనలో వర్షాలు సకాలంలో కురుస్తున్నాయి. ప్రజలకు ఈతిబాధలు లేవు. స్త్రీలు ఆరోగ్యవంత మైన బిడ్డలకు జన్మ ఇస్తున్నారు. శిశు మరణాలు లేవు. అధికశాతం నిండు నూరేళ్లూ బతుకు తున్నారు. మానసిక చింతలు లేవు. రామరాజ్యం లోకకల్యాణార్థం సస్యశ్యామలం’ అంటూ వర్ణించాడు వాల్మీకి మహర్షి.

రాముడి పాలనలో ఆరోగ్యం, సంక్షేమం, వ్యవసాయం అన్నీ బాగున్నాయంటే వాటి నిర్వహణ అంత బాగుండేదని స్పష్టమవుతుంది. ఎటు చూసినా స్వచ్ఛమైన గాలినిచ్చే పచ్చటి చెట్లు, స్వేచ్ఛగా విహరించే జింకల్లాంటి మూగజీవులతో వాతావరణం ఆహ్లాదంగా ఉండేది- అనడాన్ని బట్టి రాముడు పర్యావరణంపై ఎంత శ్రద్ధ చూపాడో అర్థమవుతుంది. అంతేకాదు పశుపక్ష్యాదులు మనుషుల్లా సంభాషించేవట. రాముడి పాదుకలను సింహాసనం మీదుంచి భరతుడు పాలిస్తుండగా.. పన్నులు కట్టమంటూ ప్రజల్ని వేధించేవారెవరూ లేరు. అలాంటి తరుణంలో న్యాయంగా కోశాగారాన్ని నింపాలనుకున్నాడు హనుమ. ఏళ్ల తరబడి పన్నులు కట్టని వారిని గుమ్మడికాయ ఎత్తు బంగారం పన్నుగా చెల్లించమన్నాడు. అది ఎక్కువ చెల్లించాల్సిన వారి దగ్గర ఎక్కువ, తక్కువ కట్ట వలసిన వారి దగ్గర తక్కువ బరువు తూగేది. అలా రాముడి పాలనలో పశుపక్ష్యాదులూ చెట్టు చేమలూ.. ఆఖరికి కోసిన కాయ కూడా న్యాయ ధర్మ విచక్షణా జ్ఞానాన్ని కలిగుండేదట. అందుకే రామరాజ్యాన్ని అంతగా ప్రశంసిస్తారు.
డా.జయదేవ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని