పామూ - కప్ప

సద్గురువు మార్గదర్శకత్వంలోనే సన్యాసి అయినా, గృహస్థు అయినా ఆధ్యాత్మికంగా పురోగతిని సాధించగలరు.

Published : 22 Dec 2022 00:17 IST

ద్గురువు మార్గదర్శకత్వంలోనే సన్యాసి అయినా, గృహస్థు అయినా ఆధ్యాత్మికంగా పురోగతిని సాధించగలరు. అర్హత లేని గురువు వల్ల ఆశ్రయం ఇచ్చిన వారు, పొందిన వారు- ఇద్దరూ భ్రష్టులవుతారు’ అన్నారు రామకృష్ణ. దాన్ని వివరిస్తూ ఓ సంఘటన గుర్తుచేశారు. ‘నేనో రోజు కోల్‌కతా దక్షిణేశ్వరంలో పంచవటి వైపు వెళ్తున్నాను. ఇంతలో సమీపంలోని సరుగుడు తోపు నుంచి ఒక కప్ప దీనంగా అరవడం వినిపించింది. పెద్దగా పట్టించుకోకుండా కుటీరంలోకి వెళ్లి ధ్యానం చేశాను. అది పూర్తయి తిరిగి వస్తున్నప్పుడు కూడా ఆ కప్ప అలాగే దీనంగా శబ్దం చేస్తుండటంతో ఏమైందని దగ్గరగా వెళ్లి చూశాను. ఓ పాము దాన్ని నోట కరుచుకుని ఉంది. అది సన్నటి నీటిపాము కావటంతో కప్పను మింగలేకపోతోంది. కనీసం వదలడంలేదు. సద్గురువు కాని వ్యక్తి చేతిలో పడిన శిష్యుల పరిస్థితి ఇలాగే ఉంటుంది’ అంటూ చెప్పారు రామకృష్ణ పరమహంస.

బి.సైదులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని