దీపం ఆర్పి వడ్డించారు!

ఒకసారి ప్రవక్త (స) తన అనుచరుడి ఇంటికి అతిథిని పంపారు. అతడి ఇంట్లో పిల్లలకు సరిపోయేంత అన్నమే ఉంది.

Published : 22 Dec 2022 00:28 IST

కసారి ప్రవక్త (స) తన అనుచరుడి ఇంటికి అతిథిని పంపారు. అతడి ఇంట్లో పిల్లలకు సరిపోయేంత అన్నమే ఉంది. అతిథికి వడ్డిస్తే పిల్లల్ని పస్తు ఉంచాల్సిన  స్థితి. భార్యాభర్తలు సంప్రదించుకుని పిల్లలను ఎలాగో సముదాయించి పడుకోబెట్టారు. అతిథికి భోజనం వడ్డించేందుకు సిద్ధమయ్యారు. ముందుగా అనుకున్నట్లు అతిథి తినే సమయంలో దీపం ఆర్పి, చీకట్లో తాము కూడా తింటున్నట్లు నటించారు. అలా తమకు లేకున్నా అతడికి సంతృప్తిగా తినిపించారు. ఇస్లాం ఆచారాల్లో అతిథి మర్యాదలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. సేవ పొందడం వారి హక్కు. వాళ్లు తిరిగెళ్లేటప్పుడు ద్వారం వరకూ వెళ్లి సాగనంపడం సంప్రదాయం. అల్లాహ్‌ను, పరలోక జీవితాన్ని విశ్వసించేవారు అతిథులను గౌరవించాలన్నది ఖురాన్‌ ఉద్బోధ. ‘ఇంటికొచ్చిన అతిథిని మూడు రోజులపాటు మర్యాదగా, మన్ననగా చూసుకోవాలి. తాను తినే ఆహారాన్నే అతిథికి కూడా వడ్డించాలి.. అతడు వెళ్తూ గృహస్థుల పాపఫలితాలను తీసుకు వెళ్తాడు’ అన్నారు ప్రవక్త. అతిథుల సేవతో ఇంటికి శుభాలు కలుగుతాయి. చేసిన తప్పిదాలు మాఫీ అవుతాయన్నది ప్రవక్త బోధల సారాంశం.

ఖైరున్నీసాబేగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని