Published : 29 Dec 2022 00:22 IST

నడిపించేది నామస్మరణే

వెలుగురేఖ చీకట్లను చీల్చినట్లు.. నారాయణ.. శ్రీమాత లాంటి ఒక్కో నామోచ్చరణ ఒక్కో ఫలితాన్నిస్తుంది. అన్నిటి ప్రయోజనమూ ఇహపర కామ్య సిద్ధ్యర్థమే. ఒక్కో గమ్యానికి వివిధ గమనాలూ, మార్గాలూ ఉన్నట్లు ఉపాసన సగుణమైనా నిర్గుణమైనా నామస్మరణ రెండింటా ఉంటుంది. ఎలాగైతే తల్లిదండ్రులు దూరంగా ఉన్నా వారిని తలచుకుంటామో ఇదీ అంతే. చిత్తశుద్ధితో చేసే స్మరణ ఇలలో సాయపడటమే కాక, ఆ పైన కూడా ఒక్కో మెట్టూ ఎక్కడానికి దోహదపడుతుంది. అయితే లౌకిక విషయాల్లో కొట్టుకుపోతున్న మనం ఇదంతా భ్రాంతి అని గ్రహించలేకపోవటం కూడా మాయే. అజ్ఞానమూ మాయే కనుక అందుకు చింతించనవసరం లేదు. మన చేసే ప్రతి పనీ భగవంతుడి బొమ్మలాటలో భాగమేననీ, పొందే ప్రతి ఫలమూ భగవదర్పితమనీ, తుట్టతుదకు మనం లీనమయ్యేది ఆ పరమాత్ముడిలోనే అనీ- మననం చేసుకుంటూ జగన్మాతా పితరులను స్మరిస్తుండాలి. అప్పుడు మన చుట్టూ అదృశ్యంగా వ్యాపించి ఉన్న సౌరభ ఆవృêం పరిమళించి మనల్ని తేలిగ్గా ముందుకు నడిపిస్తుంది.

నాగిని


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని