శత్రువుల్ని సైతం ప్రేమించాలి

ఏసుప్రభువును సిలువ వేసేందుకు సైన్యం వచ్చింది. ఆయన ప్రధాన శిష్యుడైన పేతురు ఒక సైనికుడి చెవిని కత్తితో నరికాడు.

Published : 12 Jan 2023 00:45 IST

ఏసుప్రభువును సిలువ వేసేందుకు సైన్యం వచ్చింది. ఆయన ప్రధాన శిష్యుడైన పేతురు ఒక సైనికుడి చెవిని కత్తితో నరికాడు. అప్పుడు ప్రభువు.. ‘కత్తి పట్టినవాడు, కత్తితోనే నశిస్తాడు’ అంటూ హితవు పలికి, ఆ సైనికుడి చెవిని తిరిగి అతికించారు. తనను సిలువ వేసేందుకు వచ్చారని తెలిసి కూడా అతని పట్ల కరుణ చూపి శత్రువుని కూడా ప్రేమించాలనే పాఠాన్ని నేర్పించారు. మరో సందర్భంలో కొందరు వ్యక్తులు తమ పిల్లల్ని తీసుకుని రాగా.. ఏసు శిష్యులు అడ్డగించారు. అది తెలిసిన ప్రభువు ‘మీరెందుకలా చేశారు? రానివ్వండి’ అంటూ పిల్లల్ని ఎత్తుకుని ‘నేనెవరినీ తోసేయను’ అన్నారు. స్వస్థత, సహాయం కోసం తన దగ్గరకు వచ్చేవారిని ఆయనెన్నడూ నిరాకరించలేదు. నిజంగా మనల్ని నమ్ముకున్నవాళ్లను, మన సహాయం కోరి వచ్చేవాళ్లని విడిచిపెట్టకూడదని చెప్పేవారు ఏసు.

 జి.ప్రశాంత్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని