Published : 12 Jan 2023 00:46 IST

తోలుతిత్తిలో చేప

హజ్రత్‌ మూసా (అలై) ప్రసంగిస్తున్నారు. ఓ వ్యక్తి లేచి ‘అందరికంటే గొప్ప పండితుడు ఎవరు?’ అనడిగాడు. తానే అన్నారు హజ్రత్‌. దాంతో దేవుడు ఆగ్రహించి ‘బహెరైన్‌ నదీ సంగమం వద్ద నా దాసుడొకడున్నాడు. అతను నీకంటే గొప్ప పండితుడు’ అన్నాడు. అతణ్ని ఎలా కలవాలన్న హజ్రత్‌ ప్రశ్నకు ‘ఒక చేపను తోలుతిత్తిలో పెట్టుకుని తీసుకెళ్లు. అది మాయమైన ప్రదేశంలోనే ఆ వ్యక్తిని కలుసుకో గలవు’ అన్నాడు దేవుడు. హజ్రత్‌ తన సేవకుడు యూషె బిన్‌ నూన్‌తో బయల్దేరారు.. కాసేపటికి ఒక పిట్ట వచ్చి పడవ అంచుమీద వాలింది. అది నదిలో రెండు చుక్కలు నీళ్లు తాగింది. అప్పుడు ఖిజర్‌ (అలై) అనే వ్యక్తి వచ్చి ‘దేవుడి జ్ఞానంతో పోలిస్తే మన జ్ఞానం ఈ పిట్ట ముక్కుతో పీల్చిన రెండుచుక్కలంత కూడా లేదు’ అన్నారు. వెంటనే హజ్రత్‌ తోలుతిత్తిలో చేప కోసం చూస్తే లేదు.
ఖైరున్నీసాబేగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని