Published : 26 Jan 2023 00:35 IST

బంగారు బిందె

క వ్యక్తి ఓ ఇల్లు కొన్నాడు. కొన్ని రోజులకి ఆ ఇంట్లో ఒక బంగారు బిందె దొరికింది. అతను వెంటనే ఇల్లు అమ్మిన వ్యక్తిని పిలిచి ‘సోదరా! దీన్ని నువ్వే తీసుకెళ్లు. నేను నీ దగ్గర ఇల్లు కొన్నానే గానీ బంగారం కొనలేదు’ అన్నాడు. కానీ అమ్మిన వ్యక్తి, ‘నిజాయితీగా చెప్పాలంటే నేనీ ఇంటిని అమ్మేశాక నీకు భూమిలో దొరికింది. కనుక అది నీదే, నాకు చెందదు’ అన్నాడు. ‘కానీ, నేను తీసు కుంటే అల్లా మెచ్చడు కదా’ అన్నాడితడు. ఏం చేయాలో పాలుపోక ఊరి పెద్ద వద్దకు వెళ్లారు. ఆయన ఇద్దరినీ చూస్తూ ‘మీకు పిల్లలున్నారా?’ అనడిగాడు. ఒకరు తనకు కొడుకున్నాడని, రెండో వ్యక్తి కూతురుందని చెప్పారు. ‘ఇక పేచీ లేదు, వాళ్లిద్దరికీ పెళ్లి జరిపించండి. బంగారంలో కొంత వాళ్లకిచ్చి తక్కింది దానం చేయండి’ అన్నాడు. ప్రవక్త బోధల గ్రంథం ‘సహీహ్‌ బుఖారి’లో ముహమ్మద్‌ ప్రవక్త ఉటంకించిన కథ ఇది.

తహూరా సిద్దీఖా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు