Published : 02 Feb 2023 00:30 IST

ఒక బాటసారి ప్రయాణం

ఇహలోక జీవితాన్ని భ్రాంతులూ భ్రమలూ లేకుండా గడపాలి. వస్తు సామాగ్రి పెంచుకోకుండా వీలైనంత తక్కువతో పనులయ్యేలా చూసుకోవాలి- అనేవారు ప్రవక్త. ఒకరోజు ఆయన ఒక ముతక చాపమీద విశ్రాంతిగా పడుకున్నారు. చాప పుల్లలు ఒరుసుకు పోయి, ఆ గుర్తులు ప్రవక్త శరీరంపై కనిపిస్తున్నాయి. అది చూసిన అనుచరులు ‘మీరు అనుమతిస్తే మెత్తటి చాప, పరుపు తీసుకొస్తాం’ అన్నారు. బదులుగా ‘ప్రాపంచిక సుఖాలు నాకెందుకు? నేను బాటసారి లాంటివాణ్ణి. మార్గమధ్యంలో ఎండగా ఉంటే చెట్టు నీడన కాసేపు విశ్రమించి మళ్లీ ప్రయాణం కొనసాగించడమే నా పని’ అన్నారు.

తహూరా సిద్దీఖా


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు