Published : 02 Feb 2023 00:30 IST

వినయంతో ధన్యత

అపజయాలు మనకెప్పుడూ పాఠాలు నేర్పుతాయి. వాటి నుంచి ఏం నేర్చుకున్నామన్న దాని బట్టే జీవన గమ్యం ఉంటుందంటూ క్రీస్తు ప్రబోధల్లో ఎన్నో అనుభవ పాఠాలు చెప్పారు. ఒకరోజు ప్రభువు ఆత్మ పరంగా ఎంత దీనంగా వినయంగా ఉంటే, అంత ధన్యులవుతారని, అటువంటి వారు పరలోకరాజ్యం చేరతారని (మత్తయి సువార్త 5:3) గుర్తుచేశారు. తాను దైవం అయినప్పటికీ మనిషి స్వరూపంలో తన విధేయతను పరిచయం చేసి తానే ఉదాహరణగా నిలిచారు. ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండటమే ఆత్మ విషయమైన దీనత్వం. మనం ఏ స్థాయితో మొదలుపెట్టి ఉన్నత స్థితికి వచ్చామో గుర్తుంచుకోవాలనేవారు. వినయంగా ఉంటే ఆనందం కలుగుతుందే తప్ప అందులో చిన్నతనం ఏమీ లేదు. వినయ స్వభావంతో ఎదుటివారికి తోడ్పడటమే అసలైన సేవ. అప్పుడే పుణ్యం దక్కుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. క్రీస్తు తెలియజేసిన గొప్ప సత్యమిది.

పూసపాటి విజయరాజు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు