దృఢచిత్తమే ముఖ్యం

ఎంత క్లిష్ట విషయాన్నయినా హృదయాన్ని తాకేట్టు చెప్పగల గొప్ప ఆచార్యుడు ఏసు.

Published : 23 Feb 2023 00:14 IST

ఎంత క్లిష్ట విషయాన్నయినా హృదయాన్ని తాకేట్టు చెప్పగల గొప్ప ఆచార్యుడు ఏసు. అందుకే ఆయన వాణి ప్రపంచమంతా నేటికీ ప్రవహిస్తోన్న అమృతవేణి. ఒక విషయాన్ని ఆకళింపు చేసుకోవాలంటే ఏకాగ్రత, నిశిత దృష్టి అవసరమని చెబుతూ ‘సారవంతమైన నేలలో రైతు నాటిన విత్తనాల్లా మొలకెత్తి మంచి పంటలను అందించాలే గానీ దారిలో పడిన గింజల్లా కాదు. పైగా వాటిని సాతాను అనే పక్షులు వచ్చి తినేస్తాయి. రాతినేలలో పడినా నిష్ఫలితమే. అలాగే ముళ్లకంపలో వేసిన విత్తనాలూ వృథా ప్రయాసే. చుట్టూ ఉన్న చెట్లు మొక్కను ఎదగనీయనట్లే ధనవ్యామోహం ప్రబోధలను గ్రహించనీయదు. అందుకే మీరంతా సారవంతమైన మంచి నేలలో మొలకెత్తి, మంచి పంట అందించాలి. పైపై ఆకర్షణలు, స్వార్థకాంక్షల కాలుష్యం చేరితే హృదయం వికసించదు. దృఢచిత్తాన్ని అలవరచుకోవాలి’ అంటూ వివరించాడు ఏసుప్రభువు.

డా.దేవదాసు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని